బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా ఆధార్ అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చి కథనాలు, వార్తలు రాస్తున్న వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం, కేసులు పెట్టడంపై మండిపడ్డారు. "ఆధార్ లోటుపాట్లను బయటపెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం? మనమేమన్నా బనానా రిపబ్లిక్‌లో ఉన్నామా?" అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు.
శతృఘ్న సిన్హా అనేక సందర్భాల్లో సొంత పార్టీలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆధార్ అవకతవకలను బయటపెట్టిన పత్రికకు, ఆ వార్తను వెలుగులోకి తీసుకొచ్చిన సదరు జర్నలిస్టును ఆయన ప్రశంసించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. వందలకోట్ల మంది ఆధార్ కార్డుల డేటా లీక్ అయ్యిందంటూ ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనంపై యూఐడిఏఐ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు అతనిపై, అతనికి సహకరించిన మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే..!
A journalist is hauled up for reporting alleged truth about malfunctioning & misuse of Aadhar. Are we living in a Banana Republic? What kind of "justice" is this? Is there only politics of vendetta? Even public is being victimised for coming out honestly for society & the nation.
— Shatrughan Sinha (@ShatruganSinha) January 8, 2018