కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మీ పప్పులేం ఉడకవంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని, బీజేపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), NRC పేరు చెప్పి ఎవరైనా మీ వివరాలు అడిగితే ఒక్క విషయం కూడా వెల్లడించాల్సిన అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెంగాల్ ప్రజలకు సూచించారు. హెబ్రాలో 15 మంది బీజేపీ కార్యకర్తలు ఓ ఆభరణాల దుకాణానికి వెళ్లి సీఏఏ, ఎన్ఆర్సీ కోసం డాక్యుమెంట్లు అడిగినట్లు రిపోర్ట్ చూశానంటూ, ఆ ఘటనపై దీదీ ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి తనిఖీలు చేసే అధికారం వారికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి అధికారులమని, డాక్యుమెంట్లు సమర్పించాలని అడిగితే ఇవ్వాల్సిన పనిలేదని.. ధైర్యంగా ఉండాలన్నారు.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
బీజేపీ పేరు ప్రస్తావంచకుండా బ్యాంకు ఉద్యోగులు, పోస్టాఫీసు ఉద్యోగులు రాష్ట్రంలో ఇంటింటి సర్వే మొదలుపెట్టారని గుర్తించినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిగానీ, ప్రకటన లేకుండా మీరు ఎవరికీ ఎలాంటి పత్రాలు చూపించొద్దు, ఇవ్వరాదని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ సర్వేలు చేపట్టడంతో మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
West Bengal CM Mamata Banerjee: Banks and Post offices are doing surveys without taking BJPs name, they are going house to house, no one should give information. Without the state government's approval they can't do this. https://t.co/ShMJN5X9R1
— ANI (@ANI) February 13, 2020
Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?
కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీదీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన రాజకీయ కన్సెల్టెన్సీ సంస్థ ఐప్యాక్ ఎన్నికల ప్రచారం, వ్యూహాల బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయంలో కీలకపాత్ర పోషించింది ఆయన టీమ్. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ మెజార్టీ విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్‌తో ప.బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ కలిసి పనిచేయనుంది. దీంతో ప.బెంగాల్ రాజకీయాలు ఏడాది ముందే వేడేక్కాయి.
Also Read: ఢిల్లీ తర్వాత ప్రశాంత్ కిషోర్ నెక్ట్స్ టార్గెట్ రాష్ట్రాలివే!