Droupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. భారత ప్రథమ పౌరురాలికి ఉండే ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలేంటో తెలుసా..

Facilities and Benifits for Indian President: అత్యున్నత రాజ్యాంగ హోదా అయిన రాష్ట్రపతి పదవికి ఉండే ప్రత్యేక ప్రయోజనాలు, సదుపాయాల గురించి మీకు తెలుసా...

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 22, 2022, 01:25 PM IST
  • భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
  • ఈ నెల 25న ముర్ము ప్రమాణస్వీకారం
  • రాష్ట్రపతి హోదాకు దక్కే ప్రత్యేక ప్రయోజనాలు, సదుపాయాలేంటో మీకు తెలుసా..
Droupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. భారత ప్రథమ పౌరురాలికి ఉండే ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలేంటో తెలుసా..

Facilities and Benifits for Indian President: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. తొలిసారి ఓ ఆదివాసీ మహిళకు భారత రాష్ట్రపతి అయ్యే అవకాశం రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ముకు దక్కే ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారాయి. భారత రాష్ట్రపతి హోదాలో ఉండే వ్యక్తికి దక్కే ఆ సదుపాయాలు, ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

రాష్ట్రపతికి అందే ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలు :

నెలకు రూ.5 లక్షల వేతనం. రాష్ట్రపతికి అందే వేతనంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది.
ఢిల్లీలోని రైజినా హిల్స్‌లో నివాస సదుపాయం. దీనికి ఎటువంటి అద్దె లేదా రుసుం చెల్లించనక్కర్లేదు.
బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన, విష వాయువుల దాడులను సైతం తట్టుకునే లగ్జరీ కారును రాష్ట్రపతికి కేటాయిస్తారు.
రాష్ట్రపతి భవన్‌లో ఉద్యోగుల వేతనాల కోసం పెద్ద మొత్తంలో డబ్బును కేటాయిస్తారు.
రాష్ట్రపతి రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1.5 లక్షలు ఫించన్‌గా అందుతాయి.
రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక మొబైల్ ఫోన్ బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది.
విమాన ప్రయాణం, రైలు ప్రయాణం పూర్తిగా ఉచితం.
త్రివిధ దళాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన సైనికులు రాష్ట్రపతికి భద్రతగా ఉంటారు.

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఒడిశాలోని ఉపర్‌బేడాలో జూన్ 20, 1958లో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 64 ఏళ్లు. ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరణ్ ముర్ము 2004లో కన్నుమూశారు. ద్రౌపది ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఉన్నారు. టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. 1997లో బీజేపీలో చేరారు. తొలుత కౌన్సిలర్‌గా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జార్ఖండ్ గవర్నర్ గానూ సేవలందించారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోతున్న రెండో మహిళ ద్రౌపది ముర్మునే కావడం గమనార్హం. 

Also Read: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక  

Also Read: Ranveer Singh: ఒంటిపై నూలు పోగులేకుండా రెచ్చిపోయిన రణవీర్ సింగ్.. షాకింగ్ కామెంట్స్!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News