భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ నేత నవీన్ పట్నాయక్ ప్రచారం కోసం ఉపయోగిస్తున్న హెలీక్యాప్టర్ని ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలో హెలీక్యాప్టర్లోని లగేజీలో నిషేధిత వస్తు, సామాగ్రి ఏమైనా తరలిస్తున్నారా అనే కోణంలో అధికారలు తనిఖీలు చేశారు. ఒడిషాలోని రూర్కెలాలో వున్న హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఈ తనిఖీలు జరిగాయి.