Mizoram Election Vote Counting Date Changed: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ డిసెంబర్ 4వ తేదీకి మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు మిజోరాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న జరగాల్సి ఉంది. అయితే తాజాగా డిసెంబర్ 4వ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మిజోరాం ఎన్‌జీవో సమన్వయ కమిటీ (ఎన్‌జీవోసీసీ) నిరసనల నేపథ్యంలో య కౌంటింగ్ తేదీని మార్పు చేసింది. మిజోరంలో పవిత్రమైన రోజు ఆదివారం కావడంతో కౌంటింగ్ తేదీని మార్చాలని అభ్యర్థిస్తూ రాష్ట్రంలోని వివిధ గ్రూపుల నుంచి తమకు అనేక ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘం తెలిపింది. మిజోరాం మినహా మరే ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో లేదా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
ఐదు రాష్ట్రాలు మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. మిజోరాంలో నవంబర్ 7న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. 21 సీట్లు గెలుచుకోవాలి. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్, మిజోరాం నేషనల్ ఫ్రంట్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ZPM 17 స్థానాలు, MNF 14 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. కాంగ్రెస్ కింగ్ మేకర్ అవుతుందని వెల్లడైంది. కాంగ్రెస్ 7, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Also Read: Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి