Election Code: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది. ఏయే నిబంధనలు అమల్లోకి వస్తాయి

Election Code: మరి కాస్సేపట్లో లోక్‌సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపధ్యంలో కోడ్ ఎలా ఉంటుంది. వేటిపై నిషేధముంటుందనే విషయాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2024, 09:23 AM IST
Election Code: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది. ఏయే నిబంధనలు అమల్లోకి వస్తాయి

Election Code: మరి కాస్సేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే దేశవ్యాప్తంగామోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఎన్నికలు పారదర్శకంగా , నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల కోడ్ తప్పనిసరి. అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నుంచి వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, ఓటర్లకు నియమ, నిబంధనలుంటాయి. 

ఎన్నికల కోడ్ నిబంధనలు, సూచనలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆస్థుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్‌లు, హోర్డింగులు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు తొలగించాలి. బస్డాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్థంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల్లో ప్రకటనలు, హోర్డింగులు ఉండకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఫోటోలు తొలగించాలి. మంత్రుల అధికార వాహనాల వినియోగం నిలిపివేయాలి.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు. లబ్దిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి , మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దేవాలయం, మసీదు, ప్రార్ధనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు. కులాలు, వర్గాల ఆధారంగా ఓటు అడగకూడదు. 

పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం. ఓటింగుకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగసభలపై నిషేధముంటుంది. ర్యాలీలు, సమావేశాల ముందస్తు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. లౌడ్ స్పీకర్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి. 

పోలింగ్ రోజు సూచనలు

రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో సహకరించాలి. ఓటర్లకు ఇచ్చే స్లిప్‌లు సాధారణ కాగితంపై ఉండాలి. ఏ విధమైన పార్టీ గుర్తులు, అభ్యర్ధి పేరు, పార్టీ పేరు ఉండకూడదు. ఓటింగుకు 48 గంటల ముందు మద్యంపై నిషేధం ఉంటుంది. 

Also read: POCSO Case: ఎన్నికల వేళ సంచలనం, మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News