Electricity Amendment Bill : ఇవాళే పార్లమెంట్ ముందుకు విద్యుత్ చట్టసవరణ బిల్లు... దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు..

Electricity Amendment Bill : విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు 8) పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 10:07 AM IST
  • నేడు పార్లమెంట్ ముందుకు విద్యుత్ చట్టసవరణ బిల్లు
  • వ్యతిరేకిస్తున్నపలు రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యోగులు
  • దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు
Electricity Amendment Bill : ఇవాళే పార్లమెంట్ ముందుకు విద్యుత్ చట్టసవరణ బిల్లు... దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు..

Electricity Amendment Bill : విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు 8) పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టంతో విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి మార్గం మరింత సుగమమవుతుంది. ఇది విద్యుత్ పంపిణీ రంగంలో పోటీ వాతావరణాన్ని ఏర్పరుస్తుందని.. తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్ సప్లై పొందే అవకాశం ఉంటుందని కేంద్రం చెబుతుంది. అయితే ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆయా రాష్ట్రాలు బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా విద్యుత్ ఉద్యోగుల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. 

నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుతో తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనుంది. అర్థరాత్రి నుంచే ఉద్యోగులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో చేపట్టనున్న ఆందోళనల్లో విద్యుత్ సంఘాలు పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంఘాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బీజేపీ నేతలు,ఎంపీలు, కేంద్రమంత్రుల ఇళ్లకు పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకెళ్తే నిరవధిక సమ్మె చేపడుతామన్నారు.

సోమవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్ సప్లైకి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ విద్యుత్ సప్లై నిలిచిపోతే వెంటనే పునరుద్ధరణ సాధ్యపడదని.. ఇందుకు ప్రజలు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమేనని విమర్శిస్తోంది. 

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించాలని విజ్ఞప్తి :

విద్యుత్ చట్టసవరణ బిల్లును పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తే సోమవారం (ఆగస్టు 8) దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఏఐపీఈఎఫ్ ప్రతినిధి వీకే గుప్తా తెలిపారు.

విద్యుత్ పంపిణీ రంగంలో మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్స్‌ను అనుమతించడం రాష్ట్రాల డిస్కంలను నష్టాల్లోకి నెట్టుతుందని ఏఐపీఈఎఫ్ ఛైర్మన్ శైలేంద్ర దూబే పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా ఇండస్ట్రియల్, కమర్షియల్ కన్స్యూమర్స్ ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల వైపు మళ్లితే రాష్ట్రాల డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతాయని అన్నారు. ఇకనైనా ఈ బిల్లుపై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
 

Also Read: Munugode Byelection: కూసుకుంట్లపై పార్టీ నేతల తిరుగుబాటు! కేసీఆర్ కు మునుగోడు బైపోల్ టెన్షన్..

Also Read: EE Main Result 2022: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News