Enforcement Directorate: కేంద్ర మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం నేత, ఎంపీ సుజనా చౌదరి ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావల్సిందే. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాల్ని చెల్లించకుండా ఎగ్గొట్టిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ, మాజీ తెలుగుదేశం నేత సుజనా చౌదరి ( Sujana Chowdary ) తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) సుజనా చౌదరికు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా ఆదేశించింది. డొల్ల కంపెనీలు అంటే సూట్‌కేస్ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సుజనా చౌదరిపై అభియోగాలున్నాయి.
అన్ని బ్యాంకులతో కలిపి మొత్తం 5 వేల 7 వందల కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలపై ఈడీ సుజనా చౌదరిపై కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో సుజనా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీబీఐ మూడు ఎఫ్ఐఆర్ ( FIR )లు నమోదు చేసింది. 2018లో సీబీఐ ( CBI ) సుజనా ఆస్థులపై సోదాలు నిర్వహించింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఆధారాల్ని సేకరించింది. ఇందులో సెంట్రల్ బ్యాంకు నుంచి 133 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుంచి 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి 159 కోట్లు మోసం చేసినట్టు ఉంది. దీనిపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈడీ ఫిబ్రవరి 12న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపింది.
Also read: APY Scheme: 18 ఏళ్లు నిండాయా, ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెలా చేతికి డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook