Fair & Lovely New Name: ఫెయిర్ అండ్ లవ్లీ ఇకపై గ్లో అండ్ లవ్లీ

ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ఉన్న ఫెయిర్ అనే పదం వర్ణ వివక్షకు తావిస్తోంది అని వివాదం చెలరేగడంతో సంస్థ మార్పు తీసుకొచ్చింది. అయితే దీనిపై కొంత కాలం క్రితమే దీనిపై సంస్థ కీలక ప్రకటన చేయగా.. ఇటీవలే పేరు మారుస్తూ అధికారిక ప్రకటన చేసింది

Last Updated : Jul 2, 2020, 10:45 PM IST
 Fair & Lovely New Name: ఫెయిర్ అండ్ లవ్లీ ఇకపై గ్లో అండ్ లవ్లీ

Glow & Lovely : ఫెయిర్ అండ్ లవ్లీ ( Fair & Lovely ) పేరు మారింది. గ్లో అండ్ లవ్లీ అయింది. హిందుస్థాన్ యూనీలివర్ ( Hindustan Unilever) సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్ లో మంచి విజయం సాధించింది. అయితే ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ఉన్న ఫెయిర్ అనే పదం వర్ణ వివక్షకు తావిస్తోంది అని వివాదం చెలరేగడంతో సంస్థ మార్పు తీసుకొచ్చింది. అయితే దీనిపై కొంత కాలం క్రితమే సంస్థ దీనిపై కీలక ప్రకటన చేయగా.. ఇటీవలే పేరు మారుస్తూ అధికారిక ప్రకటన చేసింది. Also Read : Plasma bank: ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు అర్హులు ?

భారత దేశంతో పాటు అంతర్జాతీయంగా ఫెయిర్ అండ్ లవ్లీ సౌందర్య సాధనాల జాబితాలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. దీంతో పాటు ఈ పేరును ప్రమోట్ చేయడానికి సంస్థ కోట్లాది రూపాయలు మార్కెటింగ్ కోసం వెచ్చిస్తోంది. అయితే అమెరికాలో వర్ణవివక్ష ఉద్యమం మొదలు కావడంతో బ్రాండ్ పేరును మారుస్తామని సంస్థ ప్రకటించింది. తాజాగా పేరును మారుస్తూ ప్రకటన చేసింది. 

Trending News