అత్యాచారం కేసులో ఫలహరి బాబాకు జీవిత ఖైదు

ఫలహరి బాబాకు జీవిత ఖైదు

Last Updated : Sep 26, 2018, 07:19 PM IST
అత్యాచారం కేసులో ఫలహరి బాబాకు జీవిత ఖైదు

ఓ అత్యాచారం కేసులో నేడు ఫలహరి బాబా అలియాస్ కౌశలేంద్ర ప్రప్నాచార్యను ఐపీసీ సెక్షన్ 506 ఏ, 376 (2) కింద దోషిగా తేల్చిన రాజస్తాన్‌లోని అల్వార్ కోర్టు.. అతడికి రూ. 1 లక్ష జరిమానాతోపాటు జీవిత ఖైదు శిక్ష విధించింది. అల్వార్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి రాజేంద్ర శర్మ ఈ తీర్పును వెల్లడించారు. 30 మంది సాక్షులు వాంగ్మూలాలు, 78 దస్త్రాలు పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. చత్తీస్‌ఘడ్‌కి చెందిన ఓ బాలిక ఫలహరి బాబా తనపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా బిలాస్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 2017 సెప్టెంబర్ 23న పోలీసులు ఫలహరి బాబాను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టు ఆదేశాల మేరకు ఫలహరి బాబా జైల్లోనే ఉన్నాడు. 

Trending News