నారీశక్తి వర్థిల్లాలి: అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ప్రముఖుల అభిప్రాయాలివే

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. "ఇదే సమయం: గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల జీవన గమనాల్లో మార్పు" అనే అంశంతో ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరపబోతున్నట్లు ఐక్యరాజసమితి ప్రకటించింది. 

Updated: Mar 8, 2018, 01:26 PM IST
నారీశక్తి వర్థిల్లాలి: అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ప్రముఖుల అభిప్రాయాలివే

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. "ఇదే సమయం: గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల జీవన గమనాల్లో మార్పు" అనే అంశంతో ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరపబోతున్నట్లు ఐక్యరాజసమితి ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు మహిళా దినోత్సవం సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం ప్రత్యేకం

నవభారత నిర్మాణంలో నారీశక్తి పాత్ర వెలకట్టలేనిది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళా దినోత్సవం సందర్భంగా మరో వైవిధ్యమైన విధానానికి నాంది పలికారు. తమ జీవితంలో కలిసిన గొప్ప మహిళలకు ట్యాగ్ చేయమని ఆయన తన అభిమానులను తెలిపారు

ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా చాలా డిఫరెంట్ పోస్టు చేశారు. స్త్రీ లేని పురుషుని జీవితాన్ని ఊహించగలమా అని తెలిపే మార్క్ ట్వైన్ సూక్తిని ఆయన ట్వీట్ చేశారు

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చాలా వైవిధ్యమైన రీతిలో ట్వీట్ చేశారు. బాల కార్మికురాలి స్థాయి నుండి ఓ బాలల హక్కుల కార్యకర్తగా మారిన 19 ఏళ్ళ జైనాబ్ గురించి ఆయన ట్వీట్ చేస్తూ.. ఆమెను మరెందరో బాలికలు ఆదర్శవంతంగా తీసుకోవాలని చెబుతూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు

హీరో అక్షయ్ కుమార్ కూడా దేశ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తమ గ్రామాల్లో విజయవంతంగా తీసుకెళ్లిన మహిళలను ఆయన కొనియాడారు. 

షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్, మహిళా దినోత్సవం సందర్భంగా కవితలతో మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయమని తమ అభిమానులకు తెలపడం విశేషం