నేడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యువత ఆకాంక్షలకు పెద్దపీట వేయడంతో పాటు, రైతుల సమస్యలను పరిష్కరించడం, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం మొదలైన అంశాలు ఈ బడ్జెట్‌లో కీలకమైన అంశాలుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ఆర్థిక మంత్రి జైట్లీకి ఇది అత్యంత క్లిష్టమైన బడ్జెట్. ముఖ్యంగా ప్రజల మధ్య ఆర్థిక సమతుల్యతను తీసుకురావడమే తమ అభిమతం అని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో... ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చారు. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఆయన ఆర్థిక శాఖ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బడ్జెట్‌లోని అంశాలపై చర్చించేందుకు మంత్రి వర్గం కూడా సమావేశమయ్యింది. ఆ తర్వాతే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి బయలుదేరి వెళ్లారు.
2019 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో..
2019 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో, ప్రజలను సంతోషపరచడానికి ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఒక అవకాశం లాంటిది. అదే విధంగా ప్రభుత్వంపై పెనుభారం మోపకుండా.. సమతుల్యాన్ని పాటించాల్సిన అవసరం కూడా ఉందని పలువురు తెలిపారు. ఈ రోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సరిగ్గా 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. కేంద్రం ప్రజల అంచనాలతో పాటు తమ ముందు ఉన్న సవాళ్లను ఎలా సమతుల్యం చేస్తుందనే అంశంపై కూడా మాట్లాడారు.
GST అమలు తరువాత మొదటి బడ్జెట్
దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) అమలు చేయబడిన తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. అయితే ఇదే బడ్జెట్లో జీఎస్టీ పై ప్రజల విశ్వసనీయత ఎంత వరకు ఉంది అనే అంశానికి కూడా మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తొలుత నిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా.. పెట్రోల్-డీజిల్ ధరలు పెంపుదల, ఉపాధి అవకాశాలు, రైతులకు రాయితీలు.. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఇప్పటికే పలు సవాళ్ళను ఎదుర్కొన్న క్రమంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Live Updates
Delhi: Finance Minister Arun Jaitley arrives at the Parliament #UnionBudget2018 pic.twitter.com/4TrV0rynvP
— ANI (@ANI) February 1, 2018
Delhi: Finance Minister Arun Jaitley arrives at the Parliament #UnionBudget2018 pic.twitter.com/VhTlrr71UC
— ANI (@ANI) February 1, 2018
ఈ రోజు ఉదయం పదిగంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకి చేరుకున్నారు. మీడియా ఆయనను చిత్రీకరిస్తుండగా.. ఆయన అందరికీ అభివాదం చేస్తూ పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది.
Delhi: Copies of #UnionBudget2018 being checked by security inside Parliament premises pic.twitter.com/Mvk0FqWYzo
— ANI (@ANI) February 1, 2018
పార్లమెంటు ప్రాంగణానికి బడ్జెట్ పత్రాలు నల్ల సంచుల్లో చేరుకున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో సెక్యూరిటీ చెక్ చేయించి లోపలికి పంపించారు రక్షణ అధికారులు
Delhi: PM Narendra Modi and Union Ministers Sushma Swaraj and Ram Vilas Paswan arrived at the Parliament #UnionBudget2018 pic.twitter.com/JUVI2rbW2F
— ANI (@ANI) February 1, 2018
10: 50 AM - భారత ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాంవిలాస్ పాశ్వాన్ ఇప్పుడే పార్లమెంటులోకి అడుగుపెట్టారు.
Delhi: Finance Minister Arun Jaitley presents #UnionBudget2018 in Parliament pic.twitter.com/4TUI5Xl0AT
— ANI (@ANI) February 1, 2018
11:09 AM - ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు
11:10 AM - భారత ఆర్థిక వ్యవస్థ 2014 నుండి, అనగా మా ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చినప్పటి నుండీ బాగా మెరుగుపడింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఏడవ ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారత్ ముందుకు వెళ్తోంది - అరుణ్ జైట్లీ
11:20 AM- భారతీయ ఆర్థిక రంగం 8 శాతం అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తోంది. 2018 - 19 నాటికి 7.2 నుండి 7.5 శాతం పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది - అరుణ్ జైట్లీ
11: 25 AM- ఈ బడ్జెట్‌లో తక్కువ ధరతో ఎక్కువ దిగుమతిని పెంచే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాం. రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా, రైతులకూ వ్యవసాయ రంగంతో పాటు ప్రత్యమ్నాయ ఉపాధి చూపించే విధంగా మేం ఆలోచన చేస్తున్నాం. ఖరీఫ్ పంటలకు ఇచ్చే కనీస ధరను ఉత్పత్తి ధర కంటే 1.5 శాతం ఎక్కువ పెంచాలని నిర్ణయించాం. వ్యవసాయ మార్కెట్ల డెవలప్‌మెంట్ కోసం 2000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం.
11: 26 AM -ఆపరేషన్ ఫ్లడ్స్ మాదిరిగానే రైతాంగ వికాసానికి ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని తీసుకొస్తున్నాం
11: 30 AM -1200 కోట్ల రూపాయలతో నేషనల్ బేంబూ మిషన్ తీసుకొస్తున్నాం. వెదురు ఉత్పత్తులకు పెద్దపీట వేయుటకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే 10000 కోట్లను ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ రంగానికి కేటాయిస్తున్నాం
11: 35 AM -వ్యవసాయ రంగం కోసం 11 లక్షల కోట్ల రూపాయలను ఇనిస్టిట్యూషన్ క్రెడిట్ క్రింద తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
11: 35 AM -ఢిల్లీలో రోజు రోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఈ సమస్యను తీర్చడం కోసం కావాల్సిన సామగ్రి, మెషనరీ సమకూర్చుకోవడానికి సబ్సిడీ ఇవ్వడం కోసం హర్యానా, పంజాబ్, యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం
11: 35 AM -దేశంలోని 8 కోట్లమంది పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది
11:40 AM- స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ప్రభుత్వం 2 కోట్ల టాయిలెట్లను నిర్మించాలని ఈ సంవత్సరం సంకల్పించింది
11:40 AM- ఈ బడ్జెట్‌లో భాగంగా విద్యారంగంలో సాంకేతికతను పెంపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టెక్నాలజీ రంగం విద్యారంగంతో కలిసి పనిచేసినప్పుడు మంచి నాణ్యత గల విద్యను పిల్లలకు ఇవ్వగలం. విద్యారంగంలోని మౌళిక సదుపాయాలను, సిస్టమ్స్‌ను 2022 నాటికల్లా పూర్తిస్థాయిలో పునర్మించడానికి శ్రీకారం చుడుతున్నాం.
11:45 AM- 2022 సంవత్సరానికల్లా, 50 శాతం షెడ్యూల్ తెగల విద్యార్థులు ఉన్న ప్రాంతాలతో పాటు.. 20000 మంది కంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో "ఏకలవ్య" ప్రాజెక్టు క్రింద విద్యాలయాలు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. నవోదయ విద్యాలయాల స్థాయిలో వీటి మేనేజ్‌మెంట్ ఉంటుంది
11:49 -ప్లానింగ్ అండ్ ఆర్టిటెక్చర్‌కి సంబంధించి రెండు కొత్త విద్యాలయాలను ఈ సంవత్సరం ప్రభుత్వం నిర్మిస్తుంది
11:50 -ఈ బడ్జెట్‌లో రూ.1200 కోట్లను దేశంలో హెల్త్ వెల్నెస్ సెంటర్లు నెలకొల్పడానికి వెచ్చిస్తాం. అలాగే 10 కోట్లమంది పేద కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల చొప్పున వైద్యఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పథకం ప్రపంచంలోనే ప్రభుత్వం ఫండింగ్ ఇస్తున్న అతి పెద్ద పథకం.
11:55 - ప్రస్తుత జిల్లా ఆసుపత్రుల్లో కొన్నింటిని అప్ గ్రేడ్ చేస్తూ.. వాటికి అనుబంధంగా 24 కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు తీసుకొస్తున్నాం
11:55 - అభివృద్ది దిశగా పయనిస్తున్న 115 ఉత్తమ జిల్లాలను ఎంపిక చేసి.. అక్కడి ప్రజలను మరింత ప్రోత్సహించే దిశగా సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాం.
12:00 - షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రూ.56,619 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం రూ.39,135 కోట్లు విడుదల చేస్తున్నాం.
12:00 -కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారికి పీఎఫ్ పై వచ్చే వడ్డీని 8.33% శాతం చేయడానికి నిశ్చయించుకున్నాం. అలాగే అధిక మొత్తం ఉద్యోగులు ఉన్న సంస్థలకి ఇదే శాతం 12% అవుతుంది.
12:00 PM - గంగా నది ప్రక్షాళన మన బాధ్యత. అలాగే నమామి స్కీమ్ క్రింద ఈ నదికి అనుబంధంగా 187 ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం.
12:00 PM -అరుణాచల్ ప్రదేశ్ దగ్గరున్న సెలే పాస్ దగ్గర టన్నల్ నిర్మాణానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
12:10 PM -10 ప్రముఖ యాత్రా స్థలాలను ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్‌గా మార్చడానికి సంకల్పిస్తున్నాం
12:10 PM -అమృత్ పథకం క్రింద 500 నగరాలకు నీటి సదుపాయాన్ని కల్పించడానికి సంకల్పించాం. ఇందులో భాగంగా 494 ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి విలువ రూ.19,428 కోట్లు ఉంటుంది.
12:11 PM -రైల్వేకి సంబంధించి 12,000 కొత్త వేగన్లు, 5160 కోచ్‌లు, 700 లోకోమోటివ్స్ వస్తున్నాయి. 25,000 కంటే ఎక్కువ ఫుట్ ఫాల్ ఉండే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అలాగే రైల్వేస్టేషన్లలో కొత్త వైఫై పాయింట్లు, సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నాం.
12:15 PM -బులెట్ ట్రైన్ నడిపే వారికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడానికి ఓ కొత్త ఇనిస్టిట్యూట్‌ను వడోదరాలో ఏర్పాటు చేస్తున్నాం.
12:20 PM -600 రైల్వే స్టేషన్లలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ముంబయి రవాణా వ్యవస్థను ఇంకా విస్తరించాలని భావించాం. 160 కిలో మీటర్ల సబ్ అర్బన్ నెట్వర్క్ బెంగళూరు కోసం తీసుకురావాలని అనుకుంటున్నాం. టెక్నాలజీని ఉపయోగించి రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ చేయించాలని భావిస్తున్నాం
12:25 PM -ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా 56 అన్ సర్వ్‌డ్ ఎయిర్ పోర్టులను, 31 అన్ సర్వ్‌డ్ హెలీప్యాడ్లను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. 124 ఎయిర్ పోర్టులు ఉన్న ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాని 5 రెట్లు విస్తరిస్తాం. సంవత్సర కాలంలో 1 బిలియన్ ట్రిప్స్ లక్ష్యంగా పనిచేస్తాం
12:30 PM -దాదాపు లక్ష గ్రామ పంచాయితీలకు ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల వైఫై స్పాట్లను గ్రామాల్లో కనెక్ట్ చేయాలని భావిస్తున్నాం.
12:30 PM - నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలో పరిశోధనల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి నిర్మిస్తాం
12:30 PM -పేమెంట్ సిస్టమ్స్‌లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తాం. క్రిప్టో కరెన్సీని నిర్మూలిస్తాం.
12:31 PM -ప్రభుత్వం 372 వ్యాపార సంస్కరణలను కనుగొంది. యూజర్ ఫీడ్ బ్యాక్‌ను బట్టి వ్యాపారం చేయాలన్నది మా అభిమతం
12:35 PM -రాష్ట్రపతి జీతభత్యాలు పెంచాలని సంకల్పించాము. రాష్ట్రపతికి 5 లక్షలు వేతనం కాగా.. ఉప రాష్ట్రపతికి రూ.4 లక్షల వేతనం లభిస్తుంది
12:40 PM -శాసనసభ్యుల జీతభత్యాలు ప్రతీ అయిదు సంవత్సరాలకు ఒక సారి పెంచే విధంగా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
12:40 PM - గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ని పునరుద్ధరించాలని భావిస్తున్నాం. దీని వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలు గోల్డ్ డిపాజిట్ అకౌంట్లు తీసుకోగలుగుతారు.
12:45 PM - 2018-19 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలోని 3.3 శాతం ఉంది
12:45 PM -2014లో 6.47 శాతం ఉన్న పన్ను చెల్లింపుదారులు, 2017లో 8.27 శాతం పెరగడం విశేషం
12:45 PM -నోట్లరద్దు కార్యక్రమాన్ని "నిజాయతీపరుల ఉత్సవం"గా భావించారు చాలామంది నిజాయతీగల పన్నుచెల్లింపుదారులు - అరుణ్ జైట్లీ
12:45 PM -100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉండే వ్యవసాయ ఉత్పత్తి కంపెనీలకు 100 శాతం టాక్స్ రిబేట్ ఇస్తాం
12:45 PM - ఆదాయపు పన్ను మినహాయింపుల్లో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరం మాదిరిగానే ఉంటుంది
12:49PM - రెండు డిఫెన్స్ ఇండస్ట్రీ క్యారిడార్లు నెలకొల్పడానికి యోచిస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లకి సంబంధించిన దేశీయ ఉత్పత్తిని ప్రమోట్ చేయడం కోసమే ఇవి పనిచేస్తాయి.
12:50PM - రూ.250 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ ఉన్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 25 శాతం పెరుగుతుంది
12:50PM -సీనియర్ సిటిజన్స్‌కు బ్యాంకు డిపాజిట్లపై రూ.50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు రాయితీని పెంచారు.
12:50PM -ట్రాన్స్ పోర్టు అండ్ మెడికల్ ఖర్చుల క్రింద.. ప్రతీ ఉద్యోగికి రూ.40,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉండాల్సిందే
12:50PM -ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పై వచ్చే ఆదాయంపై పన్నుని 10 శాతం పెంచే యోచన ఉంది
12:55PM -మొబైల్ ఫోన్స్ మీదనున్న కస్టమ్ డ్యూటీని 15 శాతం నుండి 20 శాతం పెంచారు.