BS Yediyurappa: మైనర్ బాలికపై మాజీ సీఎం అత్యాచారం.. కన్నతల్లి వేడుకుంటున్నా కూడా..

Karnataka Sexualy Assulted case: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై  బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు 2012 (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 15, 2024, 08:59 AM IST
  • బాలిక పట్ల పైశాచికంగా ప్రవర్తించిన కన్నడ మాజీ సీఎం..
  • బాలికను బెదిరించి అత్యాచారం..
BS Yediyurappa: మైనర్ బాలికపై మాజీ సీఎం అత్యాచారం.. కన్నతల్లి వేడుకుంటున్నా కూడా..

Former Karnataka CM BS Yediyurappa Booked Under POCSO: లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పై పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఆయన ఒక బాలికను లైంగికంగా వేధించారని ఆమె కుటుంబసభ్యులు బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటక కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.  బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2 వ తేదీన ఒక కేసు విషయంలో సహాయం కోరడానికి ఒక మహిళ తన 17 ఏళ్ల బిడ్డతో కలిసి యడియూరప్ప నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో మాజీ సీఎం యడ్యూరప్ప తన సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, బాలికపై కన్నేశారు.

అంతేకాకుండా.. బాలిక పట్ల  అమానుషంగా ప్రవర్తించి, అత్యాచారం చేశారని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ షాకింగ్ ఘటనతో బాలిక కుటుంబం మొదట ఎవరితో చెప్పుకొవాలో అర్థం కాక.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. చివరకు ధైర్యం చేసుకుని సదాశివ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పట్ల కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారంగా నెలకొంది. అమాయకులు, పేదలు ఏంచేస్తారులే అని ఇలాంటి వారు చెడు పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈక్రమంలో దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More: Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

Read More: Petrol Diesel Prices: వాహనదారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News