Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఇక లేరని వదంతులు వ్యాప్తి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని ఆయనకు నివాళులు అర్పిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరతీశారు.

Last Updated : Aug 13, 2020, 06:58 AM IST
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఆరోగ్య పరిస్థితిపై బుధవారం రాత్రి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాప్తి.
  • ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ.
  • ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేసిన ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ
  • విషమంగానే ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం.. ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యుల వెల్లడి
Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఇక లేరని వదంతులు వ్యాప్తి

న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని ఆయనకు నివాళులు అర్పిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరతీశారు. కానీ వాస్తవానికి అదృష్టవశాత్తుగా ఆయన బతికే ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ( Pranab Mukherjee's son Abhijit Mukherjee ) ట్విటర్ ద్వారా స్పందిస్తూ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతానికి హీమోడైనమికల్లీ స్టేబుల్‌గా ( Haemodynamically stable - గుండె నుంచి ఇతర రక్తనాళాల్లోకి బ్లడ్ పంపింగ్ ప్రక్రియ సాధారణంగా ఉండటం ) ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వాళ్లంతా వారి ప్రార్థనలు కొనసాగించాలని అభిజీత్ ముఖర్జీ తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. Also read :  Pakistan vs Saudi Arabia: పాకిస్థాన్‌కి సౌది అరేబియా భారీ షాక్

 

ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి ( Army's Research and Referral Hospital ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ( Pranab Mukherjee's health condition ) విషమంగానే ఉందని.. వెంటిలేటర్‌పై లైఫ్ సపోర్ట్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు స్పష్టంచేశారు. ఆస్పత్రిలో చేరిన అనంతరం జరిపిన కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది ( Pranab Mukherjee tested positive for COVID-19 ). Also read : Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు

Trending News