Former PM Manmohan Singh: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు. మన్మోహన్ సింగ్ జ్వరంతో బాధపడుతున్నారని పీటీఐ పేర్కొంది. మెరుగైన వైద్యం కోసం ఎయిమస్ చేరినట్లు చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ వయస్సు 92 సంవత్సరాలు.
కాగా మన్మోహన్ సింగ్ కు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి. 2009లో ఆయన బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. 1990 నుంచి ఐదు బైపాస్ సర్జరీలు జరగగా..2004లో స్టెంటింగ్ చికిత్స కూడా చేయించుకున్నారు. రెండేళ్ల క్రితం ఛాతీతో నొప్పితో ఎయిమ్స్ లో చేరిన ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
PTI SHORTS | Former PM Manmohan Singh admitted to Delhi AIIMS, condition critical
WATCH: https://t.co/pDNsTWeszK
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the headlines. #PTIVideos
— Press Trust of India (@PTI_News) December 26, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.