Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..

Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 13, 2024, 07:13 PM IST
  • పీఎస్ లో బాధితులను పట్టించుకోని అధికారి..
  • భార్యతో కలిసి హారతిచ్చి నిరసన..
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..

Rewa Woman Perform Aarti In Police Station Over Delay In Fir: మనలో ఎవరికైన అన్యాయం జరిగితే వెంటనే దగ్గరలోని పీఎస్ కు వెళ్తుంటాం. మనల్నిఎవరైన అకారణంగా దూషించిన లేదా దాడులు చేసిన వెంటనే పీఎస్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తాం. కుటుంబ తగదాలు, ఆస్తి తగాదాలు,  బైటవాళ్ల వేధింపులు, అనవరసమైన వ్యాఖ్యలు ఏది చేసిన వెంటనే పీఎస్ కు వెళ్తాం. మనిషికి రాజ్యంగం ఇచ్చిన హక్కులకు భంగం కల్గించే విధంగా ఎవరైన ప్రవర్తిస్తే వెంటనే పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసే హక్కు మనందరికి ఉంది. ఇదిలా ఉండగా.. ఇంతటి గొప్పస్థానంలో ఉన్న పోలీసులు కొన్ని సార్లు తమపనులతో వార్తలలో ఉంటారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులకు సూచిస్తుంటారు. కొందరు పోలీసులు సమాజంలో ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మెలుగుతారు. ఏదైన సమస్యతో పీఎస్ కు వెళ్తే తగిన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

 

కానీ మరికొందరు పోలీసుల శైలీ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. బాధితులను వేధించడం, కేసు విషయంలో బెదిరింపులకు పాల్పడటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఎఫైఐఆర్ నమోదు చేయడంలో పట్టనట్టు వ్యవహరిస్తారు. బాధితులు గట్టిగా నిలదీస్తేనీకు దిక్కున్న చోటక వెళ్లి చెప్పుకొమ్మని రివర్స్ అటాక్ చేస్తుంటారు. ఈ కోవకు  చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

మధ్య ప్రదేశ్ లోని రేవా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేసు విషయంలో బాధితులు రేవా పరిధిలోని పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఇన్ చార్జీ.. కేసు నమోదు చేస్తానంటూ చెప్పి బాధితులను వెళ్లమన్నాడు. ఇలా దాదాపు.. 26 రోజులు గడుస్తున్న ఇప్పటికి కూడా బాధితులకు ఎఫైఐఆర్ కాపీని మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు పీఎస్ కు వెళ్లిన ఏదో ఒక కారణంతో, పోలీసులు బాధితులను బైటకు వెళ్లేలా చేస్తున్నారు. దీంతో బాధితుడు తన ఈసారి తన భార్య,కూతురుతో కలిసి స్టేషన్ కు ఆరతితో వెళ్లాడు.

అంతే కాకుండా స్టేషన్ ఇన్ చార్జీకు హరతి ఇచ్చిమరీ ఎఫైఐఆర్ నమోదు చేయాలని వేడుకున్నాడు. దీన్ని కొందరు వీడియో తీశారు. ఈ క్రమంలో సదరు పోలీసులు బాధితులపట్ల దురుసుగా ప్రవర్తించారు. వెంటనే పీఎస్ నుంచి బైటకు వెళ్లిపోవాలంటూ కూడా బైటకు తోసేశారు. పీఎస్ లో జవాబు దారిగా ఉండాల్సిన అధికారి ఇలా ప్రవర్తించడం తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. 

 పోలీసులు మీ ఫిర్యాదును తీసుకోకుంటే ఏమి చేయాలి..

- ఒక పోలీసు అధికారి FIR దాఖలు చేయడానికి నిరాకరిస్తే,  ఫిర్యాదును వ్రాసి దానిని పోలీసు సూపరింటెండెంట్‌కు పంపండి. 

- కేసులో మెరిట్ ఉందని సూపరింటెండెంట్ భావిస్తే, వారు దర్యాప్తు ప్రారంభించడానికి ఒక పోలీసు అధికారిని నియమించవచ్చు.

- పోలీస్ స్టేషన్‌కి వెళ్లేటప్పుడు లాయర్ సహాయం తీసుకోండి. 

- FIR ఫైల్ చేయడానికి సమీపంలోని మరొక పోలీసు స్టేషన్‌కు వెళ్లండి. ఏదైనా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు 

- ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేయడం పోలీసులకు తప్పనిసరి. నేరం ఏ ప్రాంతంలో జరిగిందనేది ముఖ్యం కాదు. 

- ఒక వ్యక్తి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లేదా వేరే ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయవచ్చు. 

- పోలీసులు సమాచారాన్ని నమోదు చేసి, నేరస్థలానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. దీనినే జీరో ఎఫ్‌ఐఆర్ అంటారు.

- 'ప్రైవేట్ ఫిర్యాదు' ఫైల్ చేయడానికి నేరుగా జిల్లా/జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చు

- జాతీయ/రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి ఇతర ఫిర్యాదు ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News