Gaint Crocodile hide in Rain Water: అసలే వర్షాకాలం.. మన దేశంలో డ్రైనేజీ సిస్టమ్స్ అంతంత మాత్రమే... ఒక రోజు కాదు కానీ కేవలం ఒక గంట విపరీతంగా వర్షం పడితే ఇక అంతే సంగతులు.. రోడ్లు కనపడవు.. ఇళ్లలోకి మోకాలి వరకు వర్షపు నీరు చేతుతుంది. ఏదేమైనా వర్షాకాలం వస్తే చాలు అన్ని రకాలుగా ఇబ్బందే..
అయితే సోషల్ మీడియాలో రోజుకో వీడియో ట్రెండ్ అవుతుంటుంది. ముఖ్యంగా జంతువుల వీడియోలు, అవి చేసే ప్రవర్తనలు వైరలవుతుంటాయి. కానీ ఇపుడు వర్షాకాలంలో నడి రోడ్డుపై నీరు నిండి ఉండటం.. అందులో ఒక భయంకర జీవి భయట పడటం... వ్యక్తి దానిని చాకచక్యంగా పట్టుకోవటం... ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Aslo Read: MAA Elections 2021: పెరుగుతున్న ఉత్కంఠ.. ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హాల్ చల్ చేస్తుంది. ఒక చోట ఎడతెరపి లేకుంగా వర్షం కురిసిన కారణంగా, రోడ్లన్ని చెరువులా మారిపోయాయి. అయితే అక్కడ రోడ్డుపైనే నీటిలో ఏదో ఒక పెద్ద ఆకారం కదులుతున్నట్టుగా అక్కడి వారికి కనిపించింది. భయపడినా ఇంటా అని చూసే సరికి... గుండె ఆగినంత పనయింది.. ఎదో చేపనో, ఎదో కొట్టుకు వచ్చిందో అనుకున్నారు కానీ తీర దాన్ని చూస్తే అదొక పెద్ద మొసలి (Giant crocodile)....
ఈ ఘటన గుజరాత్‌లోని (Gujarat) వడోదరాలో (vadodara)జరిగింది. భారీగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఒక మొసలి (Giant crocodile) ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ రోడ్డుపై వర్షపు నీటిలో దాక్కొని ఉంది. ఎదో పెద్దగా కదులుతున్న అదేంటో అర్థం కాకున్నా.. పక్క ప్రణాళికతో ఒక వలను నీటిలో దూరం నుండే ఏర్పాటు చేసారు. ఇద్దరు వ్యక్తులు దూరం నుండే ఆ మొసలిని పొడవాటి కర్రతో గేదుముతూ వలలో చిక్కేలా చేసారు.
Also Read: IPL 2021: సన్‌రైజర్స్‌పై ఢిల్లీ గెలుపు...టాప్‌లోకి పంత్ సేన..
ఈ వీడియోను 'nature 27_12' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వ్యక్తి పోస్ట్ చేసిన కాసేపటికే తెగ వైరల్ అయింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఏంతో దైర్యంగా, చాకచక్యంగా మొసలిని పట్టుకోవటం అందరిని ఆకర్షిస్తుంది. యూసర్లు వారిద్దరిని లైకులు, కామెంట్లతో మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకి ఈ వీడియోకి 41 వేలకు పైగా లైకులు రాగా వీడియో తెగ వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook