Aisa Desh Hai Mera: ముస్లిం నోట 'మహాభారత్' గీతం.. హోరెత్తిపోయిన ట్విట్టర్.. (Video)

ఈ రోజు నెట్టింట్లో ఒక వైరల్ వీడితో హాల్ చల్ చేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తి 'మహాభారత్' గీతం ఆలపించిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. మీరే చూసేయండి ఆ వీడియో....

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 11:48 AM IST
  • ముస్లిం నోట 'మహాభారత్' టైటిల్ సాంగ్
  • కామెంట్లతో హోరెత్తిపోయిన ట్విట్టర్
  • 'ఐసా దేశ్ హై మేరా' అంటూ కామెంట్స్
Aisa Desh Hai Mera: ముస్లిం నోట 'మహాభారత్' గీతం.. హోరెత్తిపోయిన ట్విట్టర్.. (Video)

 Muslim Man Singing Mahabharat Title Song: భారతదేశం... మతాలెన్నో, భాషలెన్నో, కులాలెన్నో, ప్రాంతాలు మరెన్నో... అయినప్పటికీ మనందరం ఒకే చెట్టు పక్షులం.. అదే మన దేశం భారతదేశం. అన్ని మతాల ప్రజలు సోదర భావంతో ఉంటూ.. ప్రపంచదేశాలకు ఐక్యతలో ఉదాహరణగా నిలుస్తుంది మన దేశం. మరోసారి ప్రపంచానికి మన ఐక్యతను చాటే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ముస్లిం వ్యక్తి నోట 'మహాభారత్' గీతం నెటిజన్లను ఫిదా చేస్తుంది. 

ఇంటర్నెట్ ఒక ఫన్ ప్లేస్.. ఒకవేళ వీడియో జనాలకు నచ్చి మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తే అంతే ఇక కోట్ల హృదయాలను గెలుచుకుంటుంది. అయితే బిఆర్ చోప్రా (B R Chopra) యొక్కకల్ట్ టివి షో 'మహాభారత్' (Mahabharat) టైటిల్ సాంగ్ ను ఒక ముస్లిం వ్యక్తి పాడితే... ఇంకేం ఉంది సోషల్ మీడియానే ఆ వీడియో షేక్ చేస్తుంది మరియు ఆ వ్యక్తి నెటిజన్లతో 'శభాష్' అనిపించుకుంటున్నాడు. 

Also Read: Corona Death Compensation: ప్రతి కరోనా మరణానికి రూ.50 వేల పరిహారం ఇవ్వనున్న కేంద్రం!

భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner of India) డాక్టర్ ఎస్‌వై ఖురైషి (Dr SY Quraishi) ట్విట్టర్‌లో షేర్ చేసిన వెంటనే, నెటిజన్లు ఈ వ్యక్తిని ప్రేమతో ముంచెత్తారు. కామెంట్ లతో ట్విట్టర్ ను హోరెత్తించారు. 

అతడు పాటను ఆలకించిన విధానానికి, పద్దతికి ప్రశంసిస్తూ.. 'సూపర్బ్' (Superb), 'ఫెంటాస్టిక్' (Fantastic) అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో మోతమోగించేసారు. 

మహాభారతం యొక్క టైటిల్ సాంగ్ ను ముస్లిం వ్యక్తి అందించిన పాట చాలా మంది సోషల్ మీడియో యూసర్ల  ఫిదా చేసింది. ట్విట్టర్ నుండి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా యూసర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. 
ఖురైషి షేర్ చేసిన ఈ  వీడియో ఇప్పటివరకు 118.3K వీక్షణలు మరియు ట్విట్టర్‌లో 7876 లైక్‌లను సంపాదించింది.

Also Read: IPL 2021: రాజస్థాన్ తో మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందా? పంజాబ్‌ ఆటగాడిపై అనుమానం!

బిజీ ప్రపంచంలో బ్రతుకున్న మనకు ఇలాంటి వీడియోలతో మంచి స్పూర్తితో పాటు మనలో చమ్మగిల్లుతున్న మానవత్వాన్ని, దేశ ఐక్యతను మేల్కొలుపుతాయి

గత సంవత్సరం కోవిడ్-19 (COVID-19) మహమ్మారి వల్ల లాక్ డౌన్ (Lock down) కొనసాగిన కారణంగా దూరదర్శన్ (Doordarshan) లో 80-90 ల మహాభారత పురాణ కథను తిరిగి ప్రసారం చేసింది. మళ్లీ ప్రసారం చేసినప్పటికీ రికార్డు లెవెల్లో టీఆర్పి రేటింగ్స్ (TRP Rating) సొంతం చేసుకుంది. పురాణ గాథలోని ప్రధాన పాత్రలు - శ్రీ కృష్ణుడు, అర్జున్, ద్రౌపది, కర్ణుడు, దుర్యోధనుడు మరియు ఇతరులు అన్ని పాత్రలు అన్ని రకాల వయసు గల వారితో గౌరవించబడ్డాయి. 

Also Read: Video: దేశ సాంప్రదాయానికి అవమానం.. చీర కట్టుకుందని హోటల్ కు నో ఎంట్రీ..! నెటిజన్లు ఆగ్రహం

నితీష్ భరద్వాజ్ (Nitish Bharadwaj) శ్రీకృష్ణుని పాత్రలో నటించగా, గజేంద్ర చౌహాన్ (Gajendra Chauhan) యుధిష్టిర్‌గా, ప్రవీణ్ కుమార్ భీమ్‌గా (Praveen Kumar as Bhim), అర్జునిడిగా ఫిరోజ్ ఖాన్ అర్జు (Firoz Khan as Arju), సమీర్ చిత్రే నకుల్‌గా (Sameer Chitre), సంజీవ్ చిత్రే (Sanjeev Chitre) సహదేవగా నటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

Trending News