20 కేజీల బంగారంతో గోల్డెన్ బాబా తీర్థయాత్ర

గోల్డెన్ బాబాగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ముక్కర్, కన్వర్ యాత్రతో ఈ ఏడాది మరోసారి వార్తల్లో నిలిచారు.

Last Updated : Aug 5, 2018, 01:59 PM IST
20 కేజీల బంగారంతో గోల్డెన్ బాబా తీర్థయాత్ర

గోల్డెన్ బాబాగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ముక్కర్, కన్వర్ యాత్రతో ఈ ఏడాది మరోసారి వార్తల్లో నిలిచారు. యాత్రలో భాగంగా ఆయన ఒంటిపై 20 కేజీల బంగారాన్ని ధరించారు. ఆయన ధరించిన వాటిలో గోల్డ్ చెయిన్లు, దేవుడి లాకెట్లు, బ్రేస్‌లెట్స్, గోల్డ్ జాకెట్‌లు ఉన్నాయి. కాగా ఒంటిపై ఆయన ధరించిన బంగారం ధర ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.6 కోట్ల పైమాటే. ఈ బాబా ప్రతి ఏడాది హరిద్వార్ నుంచి ఢిల్లీకి 200 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తారు.

గోల్డెన్ బాబా ఒంటిమీద నగలు ధరించి యాత్ర చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన బంగారం ధరించే యాత్ర చేశారు. యాత్ర యాత్రకు ఒంటిమీద వేసుకొనే బంగారం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అంతకు ముందు చేపట్టినప్పుడు ఆయన 12-13 కేజీల బంగారు, వజ్రాల ఆభరణాలు, విలువైన రాళ్ళను ధరించారు. చేతికి 27 లక్షల ఖరీదు చేసే రోలెక్స్ వాచ్‌లను, ఖరీదైన ఉంగరాలను ధరించారు. 2017లో 14.5 కేజీల బంగారంతో బాబా యాత్ర చేశాడు.

 

మీరు ఇంత బంగారాన్ని ఎలా కొన్నారని ఆయన్ను అడగ్గా.. తన అనుచరులు విరాళంగా ఇచ్చిన డబ్బుతో కొన్నానని సమాధానమిచ్చారు. బిజినెస్ మ్యాన్ నుండి గోల్డెన్ బాబాగా మారిన సుధీర్ ముక్కర్.. ఇదే తన చివరి కన్వర్ యాత్ర అని చెప్పారు.  

బాబా ఆస్తులు కోట్ల పైమాటే. ఆయనకు సొంతంగా బీఎండబ్ల్యూ కారు, రోలెక్స్ వాచ్‌తో పాటు రూ.150 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిసింది.

Trending News