Kerala Government: గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కేరళ కళామండలం డీమ్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా తొలగిస్తూ కేరళ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు విశ్వవిద్యాలయ నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గత కొంత కాలంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతుంది. వైస్ ఛాన్సలర్ల నియామకం సహా యూనివర్సిటీల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో విజయన్ సర్కారు ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో సాంస్కృతిక కళా రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని నియమించేలా విశ్వవిద్యాలయ నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్‌లు , ప్రభుత్వాల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. తమిళనాడు గవర్నర్‌గా ఆర్.ఎన్ రవిని తొలగించాలని అధికార డీఎంకే పార్టీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం వ్యాఖ్యానించడం చర్చకు తెరలేపినట్లు అయింది. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజుల కిందట 11 యూనివర్సిటీల ఉపకులపతులు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలివ్వడాన్ని విజయన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook