ఢిల్లీ: ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చ నడుస్తుంది. దీంతో పాటు మరో 80 వస్తువులపై పన్ను శ్లాబులను తగ్గించే అవకాశాలున్నయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గత సమావేశాల్లో 28 శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు. ప్రస్తుతం 50 వస్తువులు మాత్రమే 28శాతం శ్లాబులో ఉన్నాయి.
ఇదిలా ఉండగా జీఎస్టీ రిటర్నుల ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ ను జీఎన్టీఆర్ పరిధిలోకి తెచ్చి .. దీన్ని 12 శాతం శ్లాబులో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.