Haryana CM ML Khattar: హర్యానా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ( Haryana CM ML Khattar ) కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే విషయాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.

Last Updated : Aug 24, 2020, 09:45 PM IST
  • హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనావైరస్ పాజిటివ్.
  • ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
  • తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వాళ్లంతా కొవిడ్-19 పరీక్షలు చేయించుకుని తక్షణమే క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా సీఎం విజ్ఞప్తి
Haryana CM ML Khattar: హర్యానా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ( Haryana CM ML Khattar ) కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే విషయాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వాళ్లంతా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవడంతో పాటు తక్షణమే క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. Also read : Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కి ( Jal Shakti Minister Gajendra Singh Shekhawat ) కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనతో కలిసి ఇటీవలే ఓ సమావేశంలో పాల్గొన్నందున హర్యానా సీఎం ఖట్టర్ కూడా గురువారం నుంచే హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. Also read : AP: కొత్తగా 8,601 కరోనా కేసులు.. 86 మంది మృతి

హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాతో పాటు మరో ఇద్దరు బీజేపి ఎమ్మెల్యేలు అసీం గోయెల్ ( Aseem Goel ), రామ్ కుమార్‌లకు ( Ram Kumar ) సైతం ఇవాళ ఉదయమే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ విజ్ ( Anil Vij ) తెలిపారు. Also read : Rahul Gandhi Comments: నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆజాద్

Trending News