Hathras stampede bhole baba secutiry shocking facts: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఇప్పుడు దేశంలో హట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మన దేశంలో పాటు, ప్రపంచ దేశాలు సైతం స్పందించాయి. ఈ ఘటనపై తమ సంతాపం తెలియజేశాయి. ఇదిలా ఉండగా..ఈ ఘటనకు ముఖ్యంగా భోలేబాబా పాదధూళి కోసం సత్సంగ్ వచ్చిన జనాలు ఎగబడ్డారంట.ఈ పాదధూళి తమతో పాటు ఇంటికి తీసుకెళ్తే అనేక రోగాలు, నెగెటివ్ ఎనర్జీ దూరమైపోతుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
Read more: Snake: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..
దీనిలో భాగంగానే పాదధూళి కోసం జనాలు ఒక్కసారిగా ఎగబడటం వల్ల తొక్కిసలాట జరిగింది. దీనిలో వందల మంది వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగినప్పటి నుంచి భోలేబాబా మాత్రం కన్పించకుండా పోయారు. అంతేకాకుండా.. పోలీసులు సైతం ఎఫ్ఐఆర్ లో భోలే బాబాపేరును ఎంటర్ చేయక పోవడం, ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో భోలేబాబాగా పిల్లబడుతున్న.. జగన్ గురు సాకార్ విశ్వహరి ఆచూకీ మాత్రం ఇప్పటికి దొరకలేదు.
ఈ ఘటన తర్వాత భోలేబాబా గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలేబాబా గతంలో కానిస్టేబుల్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాబాగా అవతారమెత్తారు. యూపీలోని మొయిన్ పురిలో అత్యంత విశాలమైన రాజభవనం ఈయనకు ఉంది. గతంలో ఆయనపై పలు లైంగిక వేధింపుల కేసులు యూపీ, రాజస్తాన్ లలో ఉన్నట్లుతెలుస్తోంది. అందుకే ఆయన తన భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్తుంటారు.
మహిళలతో స్పెషల్ ఆర్మీ..
భోలేబాబాకు మూడంచెల భద్రత ఉంటుందని తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం లకు ఏమాత్రం తీసి పోని విధంగా భొలేబాబా సెక్యురిటీని మెయింటెన్ చేస్తున్నారంట.. భోలే బాబా భద్రత విభాగంలో స్పెషల్ గా మహిళ ఆర్మీ కూడా ఉన్నారు. ఆశ్రమం చివరలో బాబా గది ఉంటుంది. అందులోకి ఎంపిక చేసిన ఏడుగురికి మాత్రమే అనుమతి ఉంటుందంట. ఏడుగురిలో మహిళలు, సేవ చేసే వారు ఉంటారంట. రాత్రి 8 తర్వాత బాబా ఎవరిని కలువనియ్యరంట. అందుకే రాత్రికన్న ముందే ఆయన పూజ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారంట.
భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా కోడ్ లు కూడా ఉంటాయంట. అందులో.. నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే బృందాలు బాబాకు 24 గంటలు కూడా సెక్యురిటీని అందిస్తారంట. నారాయణ సేన పింక్ డ్రెస్ ధరిస్తారు. గరుడ్ యోధ బ్లాక్ దుస్తులు, హరి వాహక్ సభ్యులు బ్రౌన్ డ్రెస్సులు వేసుకుంటారు. బాబా కాన్వాయ్ వెంట దాదాపు.. 20 మంది బ్లాక్ కమాండోలు ఎల్లవేళలా కాపాలా కాస్తుంటారు. నారాయణ సేనకు చెందిన 50 మంది, హరి వాహక్ సభ్యులు 25 మంది ఉంటారంట. దీన్ని బట్టి చూస్తే భోలేబాబాకు ఎంతో పటిష్టమైన భద్రత ఉందని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
భోలేబాబా లాయర్ ప్రకటన..
తొక్కిసలాట జరిగినప్పటి నుంచి భోలేబాబా కన్పించకుండా పోయారు. ఈ క్రమంలో ఆయన తరపు లాయర్ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం, పోలీసుల భద్రతకు భోలేబాబా సహకరిస్తారని కూడా తెలిపాడు. ప్రమాద సమయంలో భోలే బాబా వేదిక వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి