హైదరాబాద్‌లో ప్రస్తుతం వాతావరణం ఏమీ బాగాలేదు. దట్టమైన మేఘాలు కమ్ముకొని అంతా చీకటిగా మారిపోయింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురవగా.. వాటి ప్రభావం భాగ్యనగరం మీద కూడా పడింది. నగరంలో పడ్డ వర్షం వల్ల నానా బీభత్సం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలు వెలువడడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటికే ఈ వాతావరణ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ అప్రమత్తమై వాతావరణ శాఖతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే ఏర్పాటు చేస్తోంది
ఈ వాతావరణ బీభత్సం వల్ల పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్ షెల్టర్లు కూడా కొన్ని చోట్ల కూలిపోయాయి. ఆరాంఘర్ ప్రాంతంలో వర్షం వల్ల గోడ కూలిపోవడంతో పలువురు మరణించారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని.. సాధ్యమైనంత వరకు వాహనాలు వాడవద్దని కూడా పలుచోట్ల శాఖ ప్రకటించింది. ఇంకా ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
#Telangana: Rain lashed parts of Hyderabad pic.twitter.com/fe4SDlfBDD
— ANI (@ANI) May 3, 2018