హిమాచల్‌ప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభం

Last Updated : Nov 9, 2017, 05:11 PM IST
హిమాచల్‌ప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభం

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం  68 స్థానాలు ఉండగా 337 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో 50 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 7, 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్నికల బరిలో కేవలం 19 మంది మహిళా అభ్యర్థులు ఉండడటం గమనార్హం. 

ఎన్నికలు సజావుగా జరగటానికి 40 వేలకు మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.  బీజీపీ, కాంగ్రెస్ 68 స్థానాలకూ పోటీపడుతుండగా.. బీఎస్పీ 42, సి.పి.ఎం 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే ఉదయం చలితీవ్రత ఎక్కువగా ఉండడటం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతోంది. 

Trending News