Tanu Jain: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి.. టీచర్‌గా మారి.. తనూ జైన్ లైఫ్‌ స్టోరీ

IAS Officer Tanu Jain Life Story: తనూ జైన్ అనే మహిళా అధికారి తన ఉద్యోగాన్ని వదిలి టీచర్‌గా మారిపోయారు. ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించి ఎందుకు ఉద్యోగాన్ని వదిలి పెట్టారు..? సరికొత్త బాటలో ఎందుకు ప్రయణించాలని అనుకుంటున్నారు..? వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 10, 2023, 02:21 PM IST
Tanu Jain: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి.. టీచర్‌గా మారి.. తనూ జైన్ లైఫ్‌ స్టోరీ

IAS Officer Tanu Jain Life Story: ఐఏఎస్ సాధించాలని ఎందరికో కలగా ఉంటుంది. తమ లక్ష్యాన్ని సాధించేందుకు కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ఐఏఎస్ అధికారి అయిన తరువాతే ఇంటికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించిన ఓ మహిళ.. తన ఉద్యోగాన్ని వదిలి మరో వృత్తిని ఎంచుకున్నారు. ఆమెనే డాక్టర్ తనూ జైన్. ఆమె 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 

తనూ జైన్ ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ స్కూల్‌లో చదువుకున్నారు. దేశ రాజధానిలోని సదర్ ప్రాంతంలో పెరిగారు. యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఎఎస్ అధికారి కావడానికి ముందు తనూ జైన్ మెడిసిన్ చదివారు. ఆమె సుభార్తి మెడికల్ కాలేజీ నుంచి బీడీఎస్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ డిగ్రీని పొందారు. తనూ జైన్ బీడీఎస్ చదువుతున్న సమయంలో యూపీఎస్‌సీకి ప్రిపేర్ మొదలుపెట్టారు. మొదటి ప్రయత్నంలో తనూ జైన్ కేవలం 2 నెలల ప్రిపరేషన్‌లో యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే మెయిన్స్‌లో ఫెయిల్ అయ్యారు. 2014లో మూడో ప్రయత్నంలో 648వ ర్యాంకు సాధించి.. ఐఏఎస్ సాధించారు. 

ఐఏఎస్ అధికారి అయిన తర్వాత.. తనూ జైన్ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇన్సిప్రెషన్ సెషన్‌లను కొనసాగించారు. అలాగే పుస్తకాలు కూడా రాశారు. ఆమెకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 96 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది కాకుండా తనూ జైన్‌కు బోధనపై కూడా చాలా ఆసక్తి ఉంది. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో తథాస్తు అనే ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.

ఇటీవలే తనూ జైన్ ఐఏఎస్ అధికారి ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఫుల్ టైమ్ టీచర్ కావాలని నిర్ణయించుకున్నారు. ఐఏఎస్‌ని వదిలి ఉపాధ్యాయురాలిగా మారాలని తాను నిర్ణయించుకున్న కారణాన్ని తనూ జైన్ వివరించారు. "నా ఉద్యోగం చాలా బాగా సాగింది. ఏడున్నరేళ్లు పనిచేశాను. కానీ యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌లో సమస్యలు చూశాను. నేనే పరీక్షకు సిద్ధమయ్యాను. చాలా కష్టాలు పడ్డాను. ప్రిపరేషన్ సమయంలో ఔత్సాహికులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి నాకు తెలుసు. జీవితం తరచుగా ఏదైనా చేయడానికి.. మనల్ని మనం మెరుగుపరచడానికి అవకాశాలను ఇస్తుంది. నా భర్త సివిల్ సర్వీస్‌లో ఉన్నందున నాకు ఈ అవకాశం వచ్చింది. సరికొత్త బాటలో నా జీవిత ప్రయాణం మొదలుకానుంది.." అని తనూ జైన్ తెలిపారు.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Pawan Kalyan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News