ICMR Survey: కరోనా సంక్రమణ దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇండియాలో పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)దేశంలో కలకలం కల్గిస్తోంది. కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కన్పించినా మరణాల సంఖ్య తగ్గలేదు. కరోనా విపత్కర పరిస్థితులు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ కరోనా సంక్రమణపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి అంటే రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ సీరో సర్వే(ICMR Sero Survey) నిర్వహించింది. దేశం మొత్తం మీద 24.1 శాతం మందికి కరోనా సోకినట్టు ఐసీఎంఆర్ (ICMR)వెల్లడించింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లోంచి 7 వందల గ్రామాలు వార్డుల్లో ఈ సర్వే సాగింది. మొత్తం 28 వేల 589 మంది సాధారణ పౌరులు, 7 వేల 171 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో భాగంగా సేకరించిన నమూనాల్ని పరీక్షించిన తరువాత పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని తేలింది. అంటే దేశంలో పావు శాతం జనాభా కరోనా బారినపడ్డారు. అంటే అక్షరాలా 32 కోట్ల వరకూ జనాభా కరోనా బారిన పడ్డారు.
ఒక కరోనా కేసు గుర్తిస్తే..వారి ద్వారా అప్పటికే మరో 27 మందికి వైరస్ సోకి ఉన్నట్టేనని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువమంది కరోనా బాధితులున్నారు. పట్టణ ప్రాంతాల్లో వైరస్ సంక్రమణ 26.2 శాతంగా ఉంటే..గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతంగా ఉంది. వైద్యులు, నర్శులు, ఫీల్డ్‌స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మధ్య పెద్గగా గణాంకాల్లో వ్యత్యాసం లేనప్పటికీ..వైద్యులు, నర్శులలో సంక్రమణ శాతం 26.6 శాతమైతే..పరిపాలనా సిబ్బందిలో 24.9శాతంగా ఉంది. ఇది కూడా కేవలం ఈ ఏడాది ప్రారంభంలో మాత్రమే. అదే మార్చ్- ఏప్రిల్ నెలల్లో ఎలా ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అంటే దేశ జనాభాలో దాదాపు 40-45 కోట్లమందికి కరోనా సోకి ఉండవచ్చు..
Also read: Yaas Cyclone Update: యాస్ తుపాను ప్రభావంతో..మరో మూడ్రోజులపాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook