ఫొని తుపాను బాధితులకు ఐఎంఎఫ్ఏ రూ. 75 లక్షల విరాళం

ఫొని తుపాను వల్ల నష్టపోయిన ఒడిషా ప్రజలను ఆదుకునేందుకు పలు స్వచ్చంధ, కార్పోరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Last Updated : May 8, 2019, 12:56 PM IST
ఫొని తుపాను బాధితులకు ఐఎంఎఫ్ఏ రూ. 75 లక్షల విరాళం

భువనేశ్వర్:  ఫొని తుపాను ఒడిషాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో బాధితులకు సాయం చేసేందుకు ఐఎంఎఫ్ఏ సంస్థ పెద్దమనసుతో ముందుకు వచ్చింది. బాధితులను ఆదుకునేందుకు రూ. 75 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ లో నగదు జమా చేస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రకాంత్ పాండ ప్రకటించారు. 

ఈ సందర్భంగా  ఐఎంఎఫ్ఏ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రకాంత్ పాండ మాట్లడుతూ ఫొని తుపాను వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం అందించామన్నారు . ఆర్ధిక సాయంతో పాటు సహాయక చర్యలో కూడా సంస్థ ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల పంపిణీ,  పరిసరాల శుభ్రత, పునరావాస పనుల్లో తమ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ  ... తుపాను బాధితులను ఆదుకునే విషయంలో కార్పోరేట్, స్వచ్చంధ  సంస్థలుకు కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా సుబ్రకాంత్ పాండ పిలుపునిచ్చారు.
 

Trending News