Income Tax Officers Recovered 5.7 Crores from Former IPS Officer Home: ఈ పరుగుల ప్రపంచంలో అన్నిటికంటే డబ్బే ముఖ్యం. ధనం మూలం ఇదం జగత్ అనే సామెత ఉండనే ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు పనిచేసేది, కష్టపడేది కేవలం డబ్బు కోసమే. నగదు వల్లే పేరు, ప్రఖ్యాతలు వస్తారన్నది అక్షర సత్యం. ఎవరూ ఔనన్నా.. కాదన్నా ఇది మాత్రం నిజం. అయితే కొందరు డబ్బు మోజులో పడి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని చూసి.. అడ్డంగా దొరికిపోతారు. ఇలాంటి ఘటనే నోయిడాలో చోటుచేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో 2వేల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదే రాష్ట్రం నోయిడా సెక్టార్ 50 ఎ బ్లాక్‌లోని ఓ భవనంలో 1983 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నారాయణ్ సింగ్ ఉంటున్నారు. 2017లో సింగ్ రిటైర్ కాగా.. అదే సంవత్సరంలో మానసమ్ నోయిడా వాల్ట్ అనే ప్రైవేట్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను సింగ్ కుమారుడు రన్ చేస్తున్నారు. భవనం బేస్‌మెంట్‌లో అనేక కోట్ల రూపాయల నగదును పలు ప్రైవేట్ లాకర్లలో ఉంచారు.
నోయిడా సెక్టార్ 50లోని భవనం బేస్‌మెంట్‌లో కోట్ల రూపాయల నగదు ఉంచినట్లు సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బేస్‌మెంట్‌లో మొత్తం 700 లాకర్లు ఉండగా.. 18-20 లాకర్లలో భద్రపరిచిన రూ. 2 000, 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ లాకర్ల నుంచి రికవరీ చేసిన 5.77 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించేందుకు ఐటీ అధికారులు బ్యాంక్ కౌంటింగ్ మిషన్‌ను ఉపయోగించారు.
సీనియర్ ఐటీ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడుతూ... 'మాజీ ఐపీఎస్ అధికారి సెక్టార్ 50లోని తన ఇంటి బేస్‌మెంట్ నుంచి మానసమ్ నోయిడా వాల్ట్ ప్రైవేట్ సంస్థను నడుపుతున్నారు. సింగ్ రిటైర్ అయిన 2017లో ఈ కంపెనీ ప్రారంభించబడింది. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇది సెర్చ్ ఆపరేషన్ మాత్రమే. దీనికి బినామీ ఆస్తులతో ఏమైనా సంబంధం ఉందా లేదా కోణంను పరిశీలిస్తున్నాం. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత అధికారులు మీడియాకు సమాచారం ఇస్తారు. అదే సమయంలో కేసు నమోదు చేస్తారు' అని అన్నారు.
Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook