Independence Day 2022: స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఈ క్విజ్‌లో మీ స్కోర్ ఎంత..?

Independence Day 2022: భారతదేశంలో ఘనంగా  76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 'పూర్ణ స్వరాజ్యం' కలను నెరవేర్చుకోవడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు మనం ఈ రోజును దేశవ్యాప్తంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 10:38 AM IST
  • స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ..
  • ఈ క్విజ్‌కి కొంతమంది మాత్రమే
  • 10/10 స్కోర్ చేయగలరు
Independence Day 2022: స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఈ క్విజ్‌లో మీ స్కోర్ ఎంత..?

Independence Day 2022: భారతదేశంలో ఘనంగా  76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 'పూర్ణ స్వరాజ్యం' కలను నెరవేర్చుకోవడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు మనం ఈ రోజును దేశవ్యాప్తంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం.. స్వాతంత్ర్య పోరటంలో సమరయోధుల నిరంతర కృషి ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే ఈ రోజుకు పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా  `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకుంటున్నాం. ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని భారత దేశం వ్యాప్తంగా జెండా పండగలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే చాలా మందికి  స్వాతంత్య్రానికి కృషి చేసిన వారిని తలుచుకని స్మరించుకుందాం.. అంతేకాకుండా కింద పేర్కొన్న క్విజ్‌ ప్రశ్నాలను తెలుసుకుందాం.. దీని కోసం మీ సరైన సమాధానాలను తెలపండి.

క్విజ్‌ ప్రశ్నాలు ఇవే:

Q1. భారతదేశ జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు.?

ఎ) పింగళి వెంకయ్య
బి) గోపాల్ క్రిషన్ గోఖలే
సి) దాదాభాయ్ నరోజీ
d) ఫిరోజ్‌షా మెహతా

Q2. 'సర్ఫరోషీ కీ తమన్నా'(Sarfaroshi Ki Tamanna ) అనే దేశభక్తి కవితను ఎవరు రచించారు?

సి) కర్తార్ సింగ్ సరభా
బి) ముహమ్మద్ ఇక్బాల్
c) బంకిం చంద్ర ఛటర్జీ
డి) రామ్ ప్రసాద్ బిస్మిల్

Q3. కింది వాటిలో ఏ ప్రణాళికను విభజన ప్రణాళికగా అని పిలుస్తారు?

ఎ) మెకాలే ప్రణాళిక
బి) అట్లీ ప్రకటన
సి) మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు
d) మౌంట్ బాటన్ ప్రణాళిక

Q4. 1960లలో భారతదేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు?

ఎ) వర్గీస్ కురీన్
బి) నార్మన్ బోర్లాగ్
సి) M.S. స్వామినాథన్
d) వీరేంద్ర లాల్ చోప్రా

Q5. మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎర్రకోట కింది ఏ ద్వారాలు?

ఎ) లాహోరీ గేట్
బి) ఢిల్లీ గేట్
సి) కాశ్మీరీ గేట్
డి) పైవేవీ కావు

Q6. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కింది వారిలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?

ఎ) లార్డ్ మౌంట్ బాటన్
బి) విన్స్టన్ చర్చిల్
సి) క్లెమెంట్ అట్లీ
d) రామ్‌సే మెక్‌డొనాల్డ్

Q7. కింది వారిలో భారత ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు?

ఎ) లాల్ బహదూర్ శాస్త్రి
బి) భగత్ సింగ్
సి) సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
డి) చంద్రశేఖర్ ఆజాద్

Q8. కింది వాటిలో భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏది..?

ఎ) పులి
బి) ఏనుగు
సి) సింహం
d) ఒంటె

Q9. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు.?

ఎ) మహాత్మా గాంధీ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) మోతీలాల్ నెహ్రూ
d) A.O హ్యూమ్

Q 10. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ నగరం నుంచి భారతదేశంతో వాణిజ్యాన్ని ప్రారంభించింది.?

ఎ) సూరత్
బి) కలకత్తా
సి) బొంబాయి
d) గుజరాత్

సమాధానాలు ఇవే..

సమాధానాలు: 1-a, 2-d, 3-d, 4-c, 5-a, 6-c, 7-c, 8-b, 9-d, 10-a

 

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News