India First Budget: దేశంలో రేపు మద్యంతర బడ్జెట్ Interim Budget 2023 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో పూర్తి బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉంటుంది. ఇది మోదీ రెండవ దఫా ప్రభుత్వంలో చివరి బడ్జెట్ కానుంది. ఎన్నికల బడ్జెట్ అయినందున అంచనాలైతే పెద్దఎత్తున ఉన్నాయి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అంటే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని అన్ని వర్గాలకు చాలా ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ వర్గాలకు ట్యాక్స్ మినహాయింపులపై ఆశలున్నాయి. మోదీ రెండవ దఫా ప్రభుత్వంలో ఇది చివరి బడ్జెట్. అంతేకాకుండా మధ్యంతర బడ్జెట్ మాత్రమే. బడ్జెట్ సమర్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో బడ్జెట్ చరిత్ర ఏంటి, తొలి బడ్జెట్ ఎంత ఉండేదనే వివరాలు ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతాయి.
భారతదేశంలో బడ్జెట్ చరిత్ర చాలా పాతదే. దేశ స్వాతంత్య్రానికి ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే భారతదేశ తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎంత ఉండేది అనే వివరాలు ఎవరికైనా తెలుసా. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం. దేశానికి బ్రిటీషు పాలకుల నుంచి స్వాతంత్య్రం లభించిన మూడు నెలల్లోనే దేశపు తొలి బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్కే షణ్ముఖ శెట్టి 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ విభజన రేపిమ మంటలు, హింస ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ బడ్జెట్ కేవలం 7.5 నెలలదే. ఆ తరువాత దేశపు రెండవ బడ్జెట్ 1948 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు.
దేశపు తొలి కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ప్రకారం 1948 సెప్టెంబర్ వరకూ భారత-పాకిస్తాన్ రెండు దేశాలు ఒకటే కరెన్సీ వినియోగించేవారు. బడ్జెట్‌లో ఆహార ఉత్పత్తి, ఢిఫెన్స్ సర్వీసు, సివిల్ అంశాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. దేశంలో Food Production ఆ సమయంలో తక్కువ ఉండటంతో ఈ రంగంలో ఆత్మ నిర్భరతకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ బడ్జెట్‌లో రెవిన్యూ వ్యయం అంచనా 197.39 కోట్లు మాత్రమే. ఇందులో ఢిఫెన్స్ శాఖకు ఏకంగా 92.74 కోట్లు కేటాయించారు. కోట్లాది రూపాయలు రక్షణ శాఖకు ఖర్చుపెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో దేశ విభజన సమస్య ప్రధానంగా ఉండేది.
Also read: Budget 2024: నిర్మలమ్మ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో కీలకమైన 'ఆరు' అంశాలేమిటో తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook