India omicron updates: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి (Omicron cases in India) చేరింది. దీని ప్రభావం మహారాష్ట్రపై అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది. తర్వాత రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్‌లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో 275, తెలంగాణలో 260, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, ఒడిశాలో 169, హర్యానాలో 162, ఏపీలో 61 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో..కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,47,417 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ (Covid-19 Vaccination) జోరందుకుంది. ఇప్పటివరకు 1,54,61,39,465 టీకా డోసులు పంపిణీ చేశారు.
Also Read: India Covid Cases Today: ఇండియాలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి- రెండున్నర లక్షకు చేరువలో కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook