covid-19 india: దేశంలో కరోనా కేసులు(Corona cases in India) తగ్గుముఖం పట్టాయి. ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,929 కొత్త కేసులు నమోదవ్వగా... 392 మరణాలు చోటుచేసుకున్నాయి.
ఇప్పటి వరకు 3.43 కోట్ల మందికి పైగా కరోనా(Coronavirus) బారిన పడ్డారు. నిన్న 12,509 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు(Recovery Rate) 98.23 శాతంగా కొనసాగుతోంది. గత కొద్ది కాలంగా క్రియాశీల కేసులు(Active Cases) గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 1,46,950 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గింది.
Also read: Bihar spurious liquor: బిహార్‌లో పండుగ పూట విషాదం..కల్తీ మద్యం తాగి 24 మంది మృత్యువాత
నెమ్మదించిన టీకా పంపిణీ..
కొద్ది రోజులుగా కేరళ కరోనా మరణాల(Corona Deaths in Kerala) సంఖ్యను సవరిస్తోంది. దాంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం 392 మరణాలు నమోదుకాగా.. అందులో 314 కేరళలోనివే. మొత్తంగా నాలుగు లక్షల 60 వేల మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఇటీవల కాలంలో టీకా పంపిణీ(Covid-19 Vaccination) నిదానంగా సాగుతోంది. శుక్రవారం 20.75లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 107.92 కోట్లకు పైగా డోసులు పంపిణీ జరిగింది.
వరల్డ్ వైడ్..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల చోటుచేసుకుంది. కొత్తగా 5,05,201మందికి కొవిడ్ (Corona update) సోకింది. వైరస్ తో 7,688 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,98,33,471కు చేరింది. మొత్తం మరణాలు 50,53,410కి చేరాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి