India Covid-19 Updates:దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,673 మందికి కొవిడ్ సోకింది. వైరస్ భారీన పడిన మరో 45 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5 లక్షల 26 వేల 357కు పెరిగింది.
కరోనా నుంచి గత 24 గంటల్లో 20 వేల మందికి పైగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,33,49,778కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం ప్రమాదకరంగా మారింది. 5.05 శాతానికి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,43,676 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 31,36,029 మందికి వ్యాక్సినే వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 203.94 కోట్లు దాటింది.
COVID19 | India reports 19,673 new cases in the last 24 hours; Active caseload at 1,43,676 pic.twitter.com/P9PeUniXzW
— ANI (@ANI) July 31, 2022
Read also: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook