India Corona: దేశంలో కొత్తగా 25,467 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,24,74,773కి చేరింది. వైరస్ తో తాజాగా 354 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,35,110కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.09 శాతంగా ఉంది.
మహమ్మారి నుంచి 39,486 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,17,20,112కి చేరింది. రికవరీ రేటు 97.7 శాతానికి(Recovery Rate) పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో 3,19,551 యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 16,47,526 టెస్టులు(Covid Tests) చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 50 కోట్ల 93 లక్షల 91 వేల 792 టెస్టులు చేశారు. కొత్తగా 63,85,298 మందికి వ్యాక్సిన్లు(Covid Vaccine) వేశారు. ఇప్పటివరకు 58 కోట్ల 89 లక్షల 97 వేల 805 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: Corona Third Wave: అక్టోబర్ నెలలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్, భయపెడుతున్న ఆ నివేదిక
ఇండియాలో యాక్టివ్ కేసులు 14.4 వేలు తగ్గాయి. అవి 156 రోజుల కనిష్టానికి తగ్గాయి. కొత్త మరణాలు 146 రోజుల్లో అతి తక్కువ నమోదయ్యాయి. అలాగే కొత్త కేసులు(Corona Cases) వరుసగా రెండో రోజు 30వేల కంటే తక్కువ వచ్చాయి. అలాగే... మరణాలు వరుసగా రెండో రోజు 400 కంటే తక్కువ వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళ(Kerala)లో కొత్త కేసులు 13.4వేలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర(Maharastra)లో కొత్త కేసులు 3.6వేలు రాగా... తమిళనాడులో 1.6వేలు వచ్చాయి. సోమవారం దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో కొత్త మరణాలు 105 రాగా... ఆ తర్వాత కేరళలో 90, ఒడిశాలో 68 వచ్చాయి. ప్రస్తుతం 6 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
గత వారం కొత్త కేసుల్ని అంతకు ముందు వారం కొత్త కేసులతో పోల్చితే... అవి 17 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో 0.5 శాతం తగ్గాయి. టెస్టుల పాజిటివిటీ రేటు(Positivity Rate) 189 రోజుల కనిస్టానికి తగ్గింది. అది వరుసగా 59వ రోజున 3 శాతం కంటే తక్కువగా వచ్చింది. ఐతే... దేశంలోనే ఎక్కువగా కేరళలో టెస్టుల పాజిటివిటీ రేటు 16.27 శాతం ఉండగా... సిక్కింలో 10.94 శాతం, మణిపూర్‌లో 10.77 శాతం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook