India Corona Cases Updates: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు, Covid-19 మరణాలు

India Corona Cases Updates: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఇదివరకే లాక్‌డౌన్ సడలించాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై ఏ అనుమానాలు అక్కర్లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 3 లక్షల 89 వేల 302 మంది కోవిడ్19తో పోరాడుతూ మరణించారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 22, 2021, 10:29 AM IST
  • భారత్‌తో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు
  • గడిచిన 24 గంటల్లో 50 వేల దిగువన నమోదైన కోవిడ్19 కేసులు
  • వ్యాక్సినేషన్‌పై ఆందోళన అక్కర్లేదని చెబుతున్న కేంద్ర వైద్య శాఖ
India Corona Cases Updates: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు, Covid-19 మరణాలు

India Corona Cases Updates: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఇదివరకే లాక్‌డౌన్ సడలించాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై ఏ అనుమానాలు అక్కర్లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 మంది కరోనా బారిన పడ్డారు. గత 91 రోజులలో నమోదైన అతి తక్కువ కోవిడ్19 పాజిటివ్ కేసులు ఇవి కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపితే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా (India CoronaVirus Cases) బాధితుల సంఖ్య 2,99,77,861 (2 కోట్ల 99 లక్షల 77 వేల 861)కు చేరుకుంది. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 వరకు దేశంలో 1,167 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 3,89,302 (3 లక్షల 89 వేల 302) మంది కోవిడ్19తో పోరాడుతూ మరణించారు. 

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, ఆరోగ్యశాఖ క్లారిటీ

జూన్ 21న (సోమవారం నాడు) దేశవ్యాప్తంగా 81,839 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకూ కోవిడ్19 (COVID-19) మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,89,26,038 (2 కోట్ల 89 లక్షల 26 వేల 038)కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 6,62,521కు దిగొచ్చాయి. గత ఏడాది నుంచి నేటి ఉదయం వరకు దేశంలో 28 కోట్ల 87 లక్షల 66 వేల 201 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Also Read: Telangana COVID-19 updates: తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరిగిన రికవరీ రేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News