కర్ణాటక ప్రజా తీర్పు: కాంగ్రెస్‌పై బీజేపీ ఆధిక్యం.. కీలకంగా మారనున్న జేడీఎస్

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.

Last Updated : May 15, 2018, 12:41 PM IST
కర్ణాటక ప్రజా తీర్పు: కాంగ్రెస్‌పై బీజేపీ ఆధిక్యం.. కీలకంగా మారనున్న జేడీఎస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 214 నియోజకవర్గాలలో తొలి ఆధిక్యతలు అందుబాటులోకి రాగా వాటిలో 107 నియోజకవర్గాలలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. 63 చోట్ల కాంగ్రెస్ , 42 చోట్ల జేడీఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రామనగర్, చన్నపట్న నుంచి పోటీలో ఉన్న జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఆధిక్యంలో ఉన్నారు.

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కనకపురలో తమ సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి నారాయణ గౌడ కంటే ఆధిక్యంలో ఉన్నారు.

శికరిపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్థి కంటే 3420 ఓట్ల భారీ ఆధిక్యత కనబరుస్తున్నారు.

 

 

 

కర్ణాటక సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి సిద్దరామయ్య పోటీ చేసిన రెండు స్థానాలలో ఒకచోట ఆధిక్యంలో ఉన్నారు. బదామిలో సిద్దూ ఆధిక్యంలో ఉన్నారు. చాముండేశ్వరి స్థానంలో వెనకంజలో ఉన్నారు. కాగా ఫలితాల సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.

 

వరుణలో సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి యతీంద్ర ఆధిక్యంలో ఉన్నారు.

 

 

 

 

చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర ఓట్ల లెక్కింపు ఆరంభం కాగానే తన ఓటమిని అంగీకరించారు. తాను ఓడిపోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్, జేడీఎస్ కుమ్మక్కై తనను ఓడిస్తున్నారని యోగీశ్వర అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా 222 నియోజకవర్గాలను ఈ నెల 12 ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలో 40 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో గంటలో ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

 

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం  దేశమంతా ఉత్కంఠగా  ఎదురుచూస్తోంది. నేడు వెల్లడి కానున్నాయి. ఎన్నికల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు ఉండగా 3.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో 11 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56వేల మంది బలగాలను మోహరింపజేశారు. రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరుకు 11వేల మంది పోలీసులను తరలించారు. ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

 

కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు కూడా కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీలు తమతమ విజయంపై ధీమాతో ఉంటే.. హంగ్‌ వస్తే చక్రం తిప్పేందుకు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ వ్యూహాలు రచిస్తున్నారు.

 

ఈ ఫలితాలు దేశ భవిష్యత్‌ రాజకీయాలను నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్నాటకలో విజయం సాధించే పార్టీకి 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. బాబా రాందేవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

Trending News