Speaker Election: 72 ఏళ్ల దేశ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికల జరగబోతోంది. స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవం విషయంలో అధికార, విపక్షాల సయోధ్య కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఓం బిర్లా వర్సెస్ సురేష్ మధ్య పోటీ నెలకొంది.
లోక్‌సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు రంగం దిగి విపక్షాలతో చర్చించారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు అంగకీరించినా అధికార పక్షం అందుకు నిరాకరించింది. దాంతో ఇండియా కూటమి నుంచి స్పీకర్ అభ్యర్ధిగా కే సురేష్‌ను రంగంలో దించింది. 72 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. 18వ లోక్‌సభ స్పీకర్ అభ్యర్ధిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. 17వ లోక్‌సభకు కూడా ఈయనే స్పీకర్‌గా ఉన్నారు. వివాద రహితుడిగా, స్పీకర్ పదవిలో సమన్యాయం పాటించారనే అభిప్రాయం ఉంది ఈయనపై.
స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవం విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి తమ అభ్యర్ధిగా కొడికున్నిల్ సురేష్‌ను నిలబెట్టి నామినేషన్ దాఖలు చేయించింది. దాంతో స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయేకు మేజిక్ ఫిగర్ కంటే కేవలం 20 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇండియా కూటమి బలం కూడా ఎక్కువే ఉంది. క్రాస్ ఓటింగ్‌పై కూడా ఇండియా కూటమి నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో న్యూట్రల్ పార్టీల మద్దతు కోసం ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది.
ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. గత లోక్‌సభలో వైసీపీ సీఏఏ వంటి వివాదాస్పద బిల్లులకు తప్ప అన్నింటికీ బీజేపీకు మద్దతిస్తూ వచ్చింది. ఎన్డీయే నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరించింది. ఈసారి ఆ పరిస్థితి కొనసాగించకపోవచ్చు ఎందుకంటే ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ ఉండటమే ఇందుకు కారణం. వైసీపీకు లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. టీడీపీ కారణంగా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తే లేదు. అయితే ఇండియా కూటమి అభ్యర్ధికి మద్దతివ్వడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఒక్కటే మిగిలింది. మరి ఈ రెండింట్లో ఏది ఎంచుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Also read: Lok Sabha Speaker Election: ఇండియా కూటమి సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్ ఎన్నిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook