ముగ్గురు పాక్ జవాన్లను హతమార్చిన భారత ఆర్మీ

మంగళవారం భారత జవాన్లు పాకిస్థాన్ సైనికులను హతమార్చారు. భారత జవాన్లు నియంత్రణ రేఖ ఎల్వోసీ దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించి ముగ్గురు పాకిస్థాన్ సైనికులను కాల్చారు.

Last Updated : Dec 26, 2017, 12:35 PM IST
ముగ్గురు పాక్ జవాన్లను హతమార్చిన భారత ఆర్మీ

మంగళవారం భారత జవాన్లు పాకిస్థాన్ సైనికులను హతమార్చారు. భారత జవాన్లు నియంత్రణ రేఖ ఎల్వోసీ దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించి ముగ్గురు పాకిస్థాన్ సైనికులను కాల్చారు. ఈ కాల్పుల్లో ఒక పాకిస్థాన్ సైనికుడు గాయపడ్డాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. శనివారం ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ సైనికులు భారత సైన్యంపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా భారత జవాన్లు ఎల్వోసీ దాటి  పాకిస్థాన్ లోని రావల్కోట్ సెక్టార్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. 

గతఏడాది యూరీ దాడికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ దాడుల తరహాలో భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ కు బుద్దిచెప్పింది. భారత సైన్యం దీనిని ఒక 'మినీ సర్జికల్ దాడి' గా, 'లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్' గా అభివర్ణించింది. ఈ ఆపరేషన్ లో  పది మంది భారత సైనికులు పాల్గొన్నారు. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడితే.. ప్రతీకారం ఇలానే ఉంటుందని సంకేతం ఇవ్వడానికే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే పాకిస్థాన్ స్థానిక మీడియా ఛానాళ్లు, వార్తాపత్రికలు ఈ దాడులను ఖండించాయి. హేయమైన చర్యగా పేర్కొన్నాయి. 

 

Trending News