భారతీయ పైలట్లపై ( Indian Piliots ) ఫ్రాన్స్ ( France ) ప్రశంసలు కురిపిస్తోంది. శిక్షణను అద్భుతంగా పూర్తి చేసుకున్నారంటూ ఫ్రాన్స్ దేశ రాయబారి ఇమ్యాన్యుయేల్ లెనైన్ స్పష్టం చేశారు.
ఫ్రాన్స్ దేశంతో ఇండియా కుదుర్చుకున్న యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునాతనమైన రాఫెల్ ( Rafale ) యుద్ధ విమానాలు ఇండియాకు వస్తున్నాయి. మొత్తం 36 యుద్ధవిమానాల్లో తొలి విడతలో 5 విమానాలు బుధవారం నాడు అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్నాయి. దీనికోసం భారతీయ పైలట్లకు ఫ్రాన్స్ లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ శిక్షణను భారతీయ పైలట్లు అద్భుతంగా పూర్తి చేసుకున్నారని..విమానాలు బాగున్నాయని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్యాన్యుయేల్ లెనైన్ ( Frech Ambassador Emmannuel lenain ) తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయ పైలట్లు రాఫెల్ యుద్ధవిమానాలు నడిపేందుకు సమర్ధులయ్యారని ఆయన చెప్పారు.
Planes are outstanding, Indian technicians and pilots marvellously completed their training in France. They are totally capable to use these planes at their best: Emmanuel Lenain, French Ambassador to India on #Rafale fighter jets arriving tomorrow pic.twitter.com/uEEq3J4h2N
— ANI (@ANI) July 28, 2020
Also read: Rafale: మరి కొన్ని గంటల్లో భారత్ కు రాఫెల్, అంబాలాలో ఆంక్షలు