Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఇది కీలకమైన అప్‌డేట్. ఇండియన్ రైల్వే రెండ్రోజులపాటు వేయి వరకూ రైళ్లను రద్దు చేసింది. ఆ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం
రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. ఇవాళ, రేపు అంటే మే 28 29 తేదీల్లో చాలా రైళ్లను రద్దయ్యాయి. ప్రయాణాలు చేసేవారు ఏ రైళ్లు రద్దయ్యాయో చూసుకోవల్సిన అవసరముంది. భారతీయ రైల్వే మొత్తం 522 రైళ్లను మే 28వ తేదీన రద్దు చేసింది. మరో 27 రైళ్ల సోర్స్ స్టేషన్ మార్చగా..33 రైళ్ల డిస్టెన్స్ తగ్గించింది. అదే సమయంలో ఆదివారం నాడు అంటే మే 29వ తేదీన మరో 528 రైళ్లను రద్దు చేయనున్నట్టు తెలిపింది. నిన్న శుక్రవారం నాడు అంటే మే 27వ తేదీన కూడా 416 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.
మెయింటెనెన్స్, నిర్వహణా కారణాలతో మే 28, 29 తేదీల్లో మొత్తం ఒక వేయి 50 రైళ్లను రద్దు చేసినట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. పూర్తిగా, పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాల్ని రైల్వే శాఖ వెబ్‌సైట్ https://enquiry.indianrail.gov.in/mntes లో ప్రచురించింది. లేదా ఎన్‌టీఈఎస్ యాప్‌లో కూడా వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Also read: Ladakh Accident: లడఖ్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన ఆర్మీ బస్సు.. 7 మంది జవాన్లు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook