Indian Railways, IRCTC: ఇండియన్ రైల్వేస్ ముంబై రాజధాని స్పెషల్ , బిలాస్పూర్ రాజధాని స్పెషల్, చెన్నై రాజధాని స్పెషల్, సికింద్రాబాద్ రాజధాని స్పెషల్ రైళ్ల సమయాన్ని మార్చింది. కొత్త టైమ్ టేబుల్ జూలై మొదటి వారం, రెండో వారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో రైళ్లు స్టేషన్ నుంచి ప్రారంభం అయ్యే సమయంతో పాటు గమ్యస్థానానికి చేరుకునే సమయంలో కీలక మార్పులు చేశారు. రాజధాని స్పెషల్ ట్రైన్ (Rajdhani Special Train New Timing ) సమయంలో ఐఆర్‌సీటి ( IRCTC ) ఎలాంటి మార్పులు చేసిందో తెలుసుకుందాం. Also Read : ICAI CA: సీఏ మే పరీక్షలు రద్దు. నవంబర్ లో నిర్వహణకు నిర్ణయం
Mumbai Central- New Delhi Rajdhani Special Train ( 02951) టైమింగ్‌ను జులై 2వ తేదీ నుంచి 17.30 గంటలకు ప్రారంభం అవుతుంది. న్యూ ఢిల్లీకి అది 08.50కు చేరుకుంటుంది. New Delhi - Bilaspur Rajdhani Special Train ( 02442 ) జూలై 4వ తేదీ నుంచి 3 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. బిలాస్పూర్ స్టేషన్‌కు అది 12.00 గంటలకు చేరుకుంటుంది. Bilaspur -New Delhi Rajdhani Special Train (02441 ) జూలై 6వ తేదీ నుంచి 2 గంటలకు ప్రారంభం అవుతుంది. న్యూ ఢిల్లీ స్టేషన్‌కు అది 10.50కు చేరుకుంటుంది.
New Delhi-Chennai Rajdhani Special Train (02434 ) జూలై 6వ తేదీ నుంచి 3 గంటల 45 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ 8 గంటల 40 నిమిషాలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. Chennai-New Delhi Rajdhani Specail Train (02433 ) జూలై 8వ తేదీ నుంచి 6 గంటల 35 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. న్యూ డిల్లీకి 11 గంటలకు చేరుకుంటుంది. Also Read : Ticket Cancellation : ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు తెలుసా ?
New Delhi-Secunderabad Rajdhani Special Train ( 02438 ) జూలై 5వ తేదీ నుంచి 3 గంటల 45 నిమిషాలకు న్యూ డిల్లి నుంది ప్రారంభం అవుతుంది. సిక్రింద్రాబాద్ రైల్వే ష్టేషన్‌కు అది మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. Secunderabad - New Delhi Rajdhani Special Train (02437 ) జూలై 8వ తేదీ నుంచి 12 గంటల 45 నిమిషాలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. న్యూ డిల్లీకి అది 10 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..