E-Bike Rental: అక్కడ ఇ-బైక్ రెంటల్ సేవలు ఆరంభం.. గంటకు రూ. 50 మాత్రమే! క్యూ కడుతున్న జనాలు!!

త‌మిళ‌నాడులోని తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌లో ఎల‌క్ట్రిక్ బైక్ (E Bike) రెంట‌ల్ సేవలను ద‌క్షిణ రైల్వే అధికారులు తాజాగా ప్రారంభించారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ-బైక్ రెంట‌ల్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 12:29 PM IST
  • తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌లో ఇ-బైక్ రెంటల్ సేవలు ఆరంభం
  • ఇ-బైక్ రెంటల్ సేవల కోసం క్యూ కడుతున్న జనాలు
  • గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌
 E-Bike Rental: అక్కడ ఇ-బైక్ రెంటల్ సేవలు ఆరంభం.. గంటకు రూ. 50 మాత్రమే! క్యూ కడుతున్న జనాలు!!

Indian Railways launches E-Bike rental service at Trichy Railway Station: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. గత 20-30 సంవత్సరాలలో ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సొంతంగా చేసుకునే పనులను ఇప్పుడు యంత్రాల సాయంతో చేస్తున్నారు. ఇప్ప్పటివరకు పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడిన ప్రజలు.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్‌ (Indian Railways) సరికొత్తగా ఆలోచన చేసింది. ప్రయాణికుల కోసం తాజాగా ఈ-బైక్‌ ( E-Bike) రెంటల్‌ బైక్‌ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్‌ సర్వీసులను పొందవచ్చు. 

త‌మిళ‌నాడులోని తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌ (Trichy Railway Station)లో ఎల‌క్ట్రిక్ బైక్ (E Bike) రెంట‌ల్ సేవలను ద‌క్షిణ రైల్వే అధికారులు తాజాగా ప్రారంభించారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ-బైక్ రెంట‌ల్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను గంట, రోజువారీ, వారంవారీగా ఇవ్వనున్నారు. ఈ-బైక్‌ సేవలను పొందాలంటే ముందుగా.. రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆపై గంట‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు రెంట్ తీసుకున్న వ్య‌క్తి త‌న ఆధార్ కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇస్తే ఈ సేవలను పొందవచ్చు. ఈ-బైక్‌లకు GPS సౌకర్యం కూడా ఉంటుంది. దాని సహాయంతో వారు ఎక్కడ ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు. 

Also Read: Breaking News: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు

ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ (E Bike) సేవలకు తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌లో భారీ స్పందన వస్తోంది. రైల్వే ప్ర‌యాణికులే (Railway Passengers) కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్‌ రెంటల్‌ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్‌ అధికారులు వెల్లడించారు. దాంతో దగ్గరలోని జనాలు ఆ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ-బైక్‌ సేవల కోసం అక్కడి జనాలు క్యూ కడుతున్నారట.  రోజురోజుకు జనాలు తాకిడి ఎక్కువగా ఉంటుందని తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఈ బైక్‌ను ఒక్క‌సారి ఛార్జ్‌ చేస్తే.. 130 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించవచ్చు. 

Also Read: Ashes: అరంగేట్ర టెస్టులోనే చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా కీపర్.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News