దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Last Updated : Sep 26, 2019, 02:05 PM IST
దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

రాజమహేంద్రవరం: రానున్న దసరా పండగ సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడ-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక ప్రత్యేక రైలును నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై మరునాడు ఉదయం 7.25 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి వయా కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, రాయన్నపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, ద్వారపూడి, సామర్లకోట మీదుగా ఈ రైలు కాకినాడకు చేరుకుంటుంది. 

హైదరాబాద్‌-నర్సాపూర్‌, సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌, సికింద్రాబాద్‌-కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్‌ మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనున్నది. ఈ నెల 28 నుంచి 12వ తేదీ వరకు చెన్నై-చాప్రా, సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, మైసూర్‌-బర్భాంగ (వీక్లీ), వచ్చే నెల 3 నుంచి 10వ తేదీ వరకు కేఓపీ-ధన్‌బాద్‌ (వీక్లీ), వచ్చే నెల 4 నుంచి 11వ తేదీ వరకు పూర్ణా-పాట్నా (వీక్లి) రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే స్పష్టంచేసింది.

Trending News