Tejas Express locomotives flagged: న్యూఢిల్లీ: భారతీయ రైల్వే (Indian Railways) మరో అరుదైన ఘనతను సాధించింది. పుష్-పుల్ కార్యకలాపాల కోసం తయారుచేసిన తేజస్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్‌ను ఇండియన్ రైల్వే శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించింది. సరికొత్త టెక్నాలజీతో తేజస్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW) విజయవంతంగా తయారు చేసింది. అయితే ఈ ప్యాసింజర్ ఇంజన్లు 6000 హెచ్‌పీ సామర్థ్యంతో.. గంటకు 160 కిలోమీటలర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంతేకాకుండా శబ్ధ కాలుష్యం తక్కువని, పర్యావరణ రహితమైనవని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (Chittaranjan Locomotive Works) సిబ్బంది తెలిపారు. ఏరోడైనమిక్ మోడల్‌లో తయారు చేసిన రెండు WAP-5 తేజస్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్ ఇంజన్లను సీఎల్‌డబ్ల్యూ జీఎం ప్రవీణ్ కుమార్ అసన్‌సోల్ (Asansol) రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అయితే దేశీయంగా తయారు చేసిన ఇంజన్లపై రైల్వే మంత్రి అభినందిస్తూ ట్విట్ చేశారు. ఇవి మేక్ ఇన్ ఇండియా చొరవ అంటూ రైల్వే మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు.
Yet another significant push to PM @NarendraModi ji's 'Make in India' & Aatmanirbhar Bharat initiatives!
Railways unveils the first batch of indigenously manufactured Tejas Express locos for 'push-pull' operations. These are highly advanced & energy-efficient locos. pic.twitter.com/NG231ziTmF
— Piyush Goyal (@PiyushGoyal) October 2, 2020
ఈ మేరకు పియూష్ గోయల్ ఈ విధంగా ట్విట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి జీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఇది మరో ముఖ్యమైన పురోగతి.. పుష్-పుల్ కార్యకలాపాల కోసం దేశీయంగా తయారుచేసిన తేజస్ ఎక్స్‌ప్రెస్ లోకో మొదటి బ్యాచ్‌ను రైల్వే ఆవిష్కరించింది. ఇవి అత్యంత అధునాతనమైనవి.. శక్తివంతమైనవి అంటూ ఆయన ట్విట్ చేశారు. Also read: Atal Tunnel: నేడే అటల్ టన్నెల్ ప్రారంభం