Atal Tunnel: నేడే అటల్ టన్నెల్ ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్‌లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 

Last Updated : Oct 3, 2020, 10:45 AM IST
Atal Tunnel: నేడే అటల్ టన్నెల్ ప్రారంభం

PM Narendra Modi to inaugurate longest highway Atal Tunnel Today: న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్‌లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ఈ సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. మనాలీ నుంచి లాహోల్‌స్పితి వ్యాలీ వరకు రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున గుర్రపు నాడా నిర్మించారు. ఈ టన్నెల్‌తో మనాలీ నుంచి లఢఖ్‌లోని లెహ్‌ (Manali - Leh) వరకు 5-6 గంటల రోడ్డు ప్రయాణ సమయం ఆదాతోపాటు, 45 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. శీతాకాలంలో మంచు కురిసినప్పటికీ.. ఈ రోడ్డును ఇకనుంచి మూసివేయాల్సిన పని ఉండదు. దీంతోపాటు ఈ సొరంగ మార్గం వల్ల సైనికుల రాకపోకలకు కూడా వ్యూహాత్మకంగా మారనుంది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారమే మనాలికి చేరుకోని సొరంగ మార్గాన్ని పరిశీలించారు. సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  (Rajnath Singh) ఇద్దరు కలిసి దక్షిణ ముఖ ద్వారం నుంచి ఉత్తర ద్వారానికి సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. అనంతరం పలు కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

atal tannel

అటల్‌ టన్నెల్ గుర్రపు నాడా ఆకారంలో 8మీటర్ల వెడల్పున, 5.525 మీటర్ల ఎత్తున రెండు వరుసల రహదారిలో నిర్మించారు. ప్రతి 60 మీటర్లకు ఒక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 150 మీటర్లకు ఓ టెలిఫోన్‌ కనెక్షన్‌, ప్రతి 500 మీటర్ల వద్ద అత్యవసర ద్వారం ఏర్పాటు చేశారు. ప్రతి 2.2కిలోమీటర్ల వద్ద గుహలు, ప్రతి కిలోమీటరు వద్ద గాలి నాణ్యత పర్యవేక్షణ, ప్రతి 250 మీటర్ల వద్ద మైకు, సీసీటీవీ కెమేరాలు అమర్చారు. చిన్న సంఘటన జరిగినా పసిగట్టే సాంకేతిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. 

ఇదిలాఉంటే.. ముందుగా ఈ టన్నెల్‌ను రోహ్తాంగ్ టన్నెల్ అని పిలిచేవారు. అయితే.. 2019 డిసెంబర్ 24 న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన కృషిని గౌరవిస్తూ.. రోహ్తాంగ్ టన్నెల్‌ను అటల్ టన్నెల్‌గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

Trending News