/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

కార్పొరేట్ సోషల్ రెస్పీన్సిబిలిటీ స్థూలంగా చెప్పాలంటే సీఎస్ఆర్‌లో భాగంగా వివిధ సంస్థలు ఏటా నిర్ణీత మొత్తం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాయి. కొన్ని సంస్థలైతే అంతకుమించి దానం చేస్తూ తమ ఉదారతను చాటుకుంటాయి. 2022లో దేశంలో అత్యధికంగా విరాళాలు అందించిన పారిశ్రామిక వేత్తల జాబితా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ప్రతి కంపెనీ సీఆర్ఎస్‌లో భాగంగా లేదా సేవా తత్పరతతోనే సేవా కార్యక్రమాలు  చేయడం లేదా విరాళాలు ఇవ్వడం చేస్తుంటాయి. ఇంకొంత మంది మాత్రం మనసా వాచా నమ్మి సేవా కార్యక్రమాల కోసం భారీగా విరాళాలు ఇస్తుంటారు. అటువంటి వారి జాబితానే ఇది. 2022లో వివిధ సంస్థల యజమానులు ఇచ్చిన విరాళాల జాబితా పరిశీలిస్తే..టాప్ 5లో వరుసగా హెచ్‌సిఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబం, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, కేఎం బిర్లా, మైండ్ ట్రీ అధినేతలున్నారు. 

2022 సంవత్సరంలో ఎవరి విరాళం ఎంత

1. హెచ్‌సిఎల్ శివ నాడార్ కుటుంబం                                         1161 కోట్లు
2. విప్రో అజీమ్ ప్రేమ్‌జి                                                                484 కోట్లు
3. రిలయన్స్ ముకేష్ అంబానీ                                                      411 కోట్లు
4. కేఎం బిర్లా కుటుంబం                                                               242 కోట్లు
5. మైండ్ ట్రీ సుబ్రతో, సుస్మితా బాగ్చి                                           213 కోట్లు
6. మైండ్ ట్రీ ఎన్ఎస్ , రాధా పార్ధసారధి                                       213 కోట్లు
7. అదానీ గౌతమ్ అదానీ కుటుంబం                                             190 కోట్లు
8. వేదాంత అనిల్ అగర్వాల్ కుటుంబం                                       165 కోట్లు
9. ఇన్‌‌ఫోసిస్ నందన్ నీలేకని                                                       159 కోట్లు   
10. ఎల్అండ్‌టి ఏఎం నాయక్                                                      142 కోట్లు
11. రోహిణి నీలేకని                                                                        120 కోట్లు
12. క్వెస్ అజిత్ ఐజాక్                                                                  115 కోట్లు
13. సీరమ్ సైరస్, అదార్ పూణావాలా                                            112 కోట్లు
14. జెరోడా నిఖిల్ కామత్, నితిన్ కామత్                                        100 కోట్లు
15. ఇంటర్ గ్లోబ్ రాకేశ్ గ్యాంగ్‌వాల్                                                 100కోట్లు

వాస్తవానికి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ముకేష్ అంబానీ తప్పించి మిగిలిన వారందరిలో అత్యంత ధనికుడు గౌతమ్ అదానీ. కానీ జాబితాలో మాత్రం ఆయన పేరు 7వ స్థానంలో ఉంది. ఆయన కంటే చాలా తక్కువ వ్యాపారం కలిగిన మైండ్ ట్రీ నుంచి నలుగురు ఏకంగా 426 కోట్ల విరాళాలు ఇవ్వడం గమనార్హం. అందుకే విరాళాలు ఇవ్వాలంటే పెద్ద మనస్సుుండాలి. అందుకే హెచ్‌సిఎల్ శివ్ నాడార్, విప్రో ప్రేమ్ జి, రిలయన్స్ ముకేష్ అంబానీ, కేఎం బిర్లా, మైండ్ ట్రీ అధినేతలు అగ్రస్థానంలో నిలిచారు. 

Also read: Metro and Reliance Deal: మెట్రో ఇండియాను భారీ డీల్‌లో చేజిక్కించుకున్న రిలయన్స్, డీల్ వివరాలు ఇవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Indias highest doners of 2022 year, shiv nadar, premji, mukesh and birla listed first 4 of top 15 doners
News Source: 
Home Title: 

Top Doners 2022: దేశంలో 2022 టాప్ 15 దానకర్ణుల జాబితా, అగ్రస్థానంలో ఎవరున్నారు

Top Doners 2022: దేశంలో 2022 టాప్ 15 దానకర్ణుల జాబితా, అగ్రస్థానంలో శివ నాడార్, ప్రేమ్ జి, ముకేష్, బిర్లాలు
Caption: 
Shiv nadar and ajim premji ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Top Doners 2022: దేశంలో 2022 టాప్ 15 దానకర్ణుల జాబితా, అగ్రస్థానంలో ఎవరున్నారు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, December 22, 2022 - 15:37
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
58
Is Breaking News: 
No