పుల్వామా ఉదంతం తర్వాత భారత్-పాకిస్థాన్ ల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తో అన్ని రకాల సంబంధాలు భారత్ తెచ్చకుంటోంది. ప్రజలు కూడా స్వచ్ఛంధంగా దీనికి సహకరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిని వాయిదాకు ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్ కు పాక్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన చగన్ కర్వార్ అనే యువతికి ఈ నెల 8న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసేశారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసాలు కూడా తీసేసుకున్నారు.
అంతలోనే అనుకోకుండా పుల్వామా ఉగ్రదాడితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని వరుడు మహేంద్ర సింగ్ మీడియాకు తెలిపాడు. ఇరుదేశాల మధ్య పరిస్థితి చక్కబడ్డాక వివాహం చేసుకుంటామని వివరించాడు