భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. శనివారం జరిగిన బోర్డు ఆఫ్ మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఇన్ఫోసిస్ సీఈఓ పేరును ప్రకటించింది.
"ఇన్ఫోసిస్ సీఈఓగా, ఎండీగా పరేఖ్ త్వరలో బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్‌రావుకు అభినందనలు. పరేఖ్‌కు గ్లోబల్ మీడియాలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌ను నడిపించడంలో ఆయనే సరైన వ్యక్తి అని బోర్డు భావించింది. ఆయన చేరికను ఇన్ఫోసిస్ సాదరంగా ఆహ్వానిస్తోంది" అన్నారు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని.
జనవరి 2 వ తేదీ నుంచి సలీల్ ఎస్ పరేఖ్ ఇన్ఫోసిస్ సీఎండీగా బాధ్యతలు చేపడతారు. తాత్కాలిక సీఈఓ ప్రవీణ్‌రావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రవీణ్‌రావు యధావిధిగా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. బోర్డు పూర్తికాలపు డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారు అన్నారు నందన్.