INS Imphal: రేపు పశ్చిమ నావికాదళంలో చేరనున్న క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్

INS Imphal భారత నావికాదళంలో మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. శత్రు క్షిపణుల్ని ధ్వంసం చేసే వార్ షిప్ ఇండియన్ నేవీలో ప్రవేశించనుంది. ఈ వార్ షిప్ విశేషాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2023, 10:23 AM IST
INS Imphal: రేపు పశ్చిమ నావికాదళంలో చేరనున్న క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్

INS Imphal పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన మిస్సైల్ విధ్వంసక క్షిపణి ఐఎన్ఎస్ ఇంఫాల్ భారత నావికా దళం అమ్ములపొదిలో వచ్చి చేరనుంది. ఈ క్షిపణి ద్వారా భారత దేశ నావికా రంగం మరింత బలోపేతం కానుంది. హిందూ మహా సముద్రంపై ఇండియా ఆధిపత్యానికి ఉపయోగపడనుంది. 

భారత నావికాదళం సామర్ధ్యం మరింత పెరగనుంది. పూర్తిగా దేశీయంగా తయారైన సెల్ఫ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ త్వరలో రేపు మంగళవారం భారత నావికా దళంలో ప్రవేశించనుంది. హిందూ మహా సముద్రంలో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు, భారత్ ఆధిపత్యం పెంచేందుకు ఈ వార్ షిప్ ఉపయోగపడనుంది. నార్త్ ఈస్ట్ రీజియన్‌లోని సిటీ పేరు పెట్టడం ఇదే తొలిసారి. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్‌లో రేపు జరగనున్న కమీషనింగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. కమీషనింగ్ కార్యక్రమం పూర్తి కాగానే పశ్చిమ నావికా దళంలో ఐఎన్ఎస్ ఇంఫాల్ చేరనుంది. 

ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రత్యేకతలు

ఐఎన్ఎస్ ఇంఫాల్ బరువు 7,400 టన్నులు. 164 మీటర్ల పొడవైన ఈ వార్ షిప్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యూంటీ షిప్ మిసైల్స్, టార్ఫిడోలను ప్రయోగించనుంది. కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ ప్రొపల్షన్ ఏర్పాటైంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. బ్రహ్మోస్ సహా మధ్య శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ సబ్‌మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లు, 76 మిల్లీమీటర్ల సూపర్ రాపిడ్ గన్ మౌంట్ ఉంటాయి. మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిచిన ఈ వార్ షిప్‌ను సముద్రంలో ట్రయల్స్ తరువాత అక్టోబర్ 20వ తేదీన ఇండియన్ నేవీకు అప్పగించారు. సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్స్‌ను ఈ షిప్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. సర్వైలెన్స్ రాడార్ కూడా అనుసంధానమై ఉంది.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News